రేపటికి పనులు పూర్తిచేయండి
ABN , Publish Date - Jan 18 , 2025 | 11:50 PM
భక్తులకు ఇబ్బంది కలగకుండా యుద్దప్రాతి పదికన పనులు చేపట్టాలని, సోమవారానికి పనులు పూర్తి చేయాలని,సాధారణ భక్తులను దృష్టిలో ఉంచుకుని అందరికి స్వామి వారి దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే గొండు శంకర్ కోరారు.

అరసవల్లి, జనవరి 18(ఆంధ్రజ్యోతి):భక్తులకు ఇబ్బంది కలగకుండా యుద్దప్రాతి పదికన పనులు చేపట్టాలని, సోమవారానికి పనులు పూర్తి చేయాలని,సాధారణ భక్తులను దృష్టిలో ఉంచుకుని అందరికి స్వామి వారి దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే గొండు శంకర్ కోరారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఫిబ్రవరి 2,3,4 తేదీల్లో నిర్వహించే రఽథసప్తమి వేడుకల్లో భాగంగా ఉత్సవాల పనులు యుద్దప్రాతిపదికన సాగుతున్నాయి. ఈ మేరకు గొండు శంకర్ శనివారం రాత్రి అధికారులతో కలిసి పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రఽథసప్తమికి ఆలయ పరిసరాలతో పాటు శ్రీకాకుళం నగర సుందరీ కరణ పనులు కూడా వేగవంతం చేశామన్నారు.
ఫ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలే టీడీపీకి బలమని, వారికి పార్టీలో ఎప్పుడూ ప్రత్యేక గౌరవం, గుర్తింపు ఉందని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి సభ్యత్వ నమోదు పూర్తికావడంతో పార్టీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ, పార్టీ శ్రేణులతో కలిసి శనివారం శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్డులో గల జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
ఫ గార మండలంలోని కొర్నికి చెందిన ఎన్ని శ్రీనివాసరావు అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆయన కుటుంబానికి ఎమ్మెల్యే గొండు శంకర్ శ్రీకాకుళంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో రూ.92వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు.
ఫశ్రీకాకుళం రూరల్,జనవరి 18 (ఆంధ్రజ్యోతి): సింగుపురంలో నిర్మాణంలో ఉన్న నర్సింగ్ కళాశాల పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. సింగుపురంలో నిర్మాణంలో ఉన్న నర్సింగ్ కళాశాలను పరిశీలించారు.