లీజు రద్దు చేసే వరకూ పోరాటం
ABN , Publish Date - Jan 30 , 2025 | 11:55 PM
నివగాం ఆర్టీసీ కాంప్లెక్స్ లీజు రద్దు చేసే వరకు పోరాడుతా మని ఏపీవ్యవసాయ కార్మికసంఘం జిల్లా అధ్యక్షుడు శిర్ల ప్రసాద్ తెలి పారు.

కొత్తూరు, జనవరి 30 (ఆం ధ్రజ్యోతి): నివగాం ఆర్టీసీ కాంప్లెక్స్ లీజు రద్దు చేసే వరకు పోరాడుతా మని ఏపీవ్యవసాయ కార్మికసంఘం జిల్లా అధ్యక్షుడు శిర్ల ప్రసాద్ తెలి పారు. గురువారం నివగాంలో లీజు రద్దుపె నిర్వహించిన కార్యక్రమం లో మాట్లాడుతూ ప్రజలు, ప్రయా ణికులకు ఎంతో సౌలభ్యంగా కాంప్లెక్స్ ఉండేదని, డబ్బులకోసం ప్రైవేటువ్యక్తులకు అప్పగించడం సరికా దన్నారు.ఎమ్మెల్యే జోక్యం చేసుకొని లీజు రద్దుకు సహకరించాలని కోరారు. సమావేశంలో ఆలవెల్లి రాంబాబు, పూర్ణచం ద్రపట్నాయక్, చిన్నారావు, ధర్మారావు, గోపాల్, ఉగాది పాల్గొన్నారు.