వ్యవసాయ సేవలు ఇక సులభతరం
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:15 AM
: వ్యవసాయ రంగాన్ని డిజిట లైజేషన్ చేసి, సేవలను మరింత సులభతరం చేసే సంకల్పంతో ప్రభుత్వం రైతుల కు 14 అంకెలతో కూడిన ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్యను ఆధార్ కార్డు తరహా లో అందించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు.

శ్రీకాకుళం కలెక్టరేట్, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగాన్ని డిజిట లైజేషన్ చేసి, సేవలను మరింత సులభతరం చేసే సంకల్పంతో ప్రభుత్వం రైతుల కు 14 అంకెలతో కూడిన ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్యను ఆధార్ కార్డు తరహా లో అందించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. సొంత భూమి గల ప్రతిరైతుతోనూ రిజిస్ట్రేషన్ చేయించాలని పేర్కొన్నారు. మంగళవారం శ్రీకా కుళంలోని కలెక్టర్ కార్యాలయంలో జేసీ ఫర్మాన్‌అహ్మద్ ఖాన్‌తో కలిసి జిల్లాలోని పలుశాఖల జిల్లా అధికారులతో గ్రామ సచివాలయాల పనితీరు, పల్లె పండుగ, ఉపాధిహామీ పథకం, ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన, పారిశుధ్యనిర్వహణ, స్వర్ణ పంచాయతీ, సీజనల్ వ్యాధులు, ధాన్యం సేకరణ, రెవెన్యూ సర్వేలు, రీసర్వే ఫిర్యాదులు, లోకాయుక్త కేసులు, గ్రీవెన్స్‌ఫిర్యాదులపై సమీక్షించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ గ్రామసచివాలయాల్లో బయోమెట్రిక్ విధానాన్ని సమర్థవంతం గా అమలుచేయాలని, సేవల నాణ్యతను మెరుగుపరచాలనికోరారు. ఉపాధి కూలీ లకు పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ వంటి సౌకర్యాలు కల్పించాలని, ప్రధానమం త్రి సూర్యఘర్ యోజన పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, స్వర్ణ పంచాయితీ లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళికలు రూపొందించాలని, ధాన్యం సేకరణ పర్యవేక్షించాలని, రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని, లోకాయుక్త కేసులను సత్వరమే పరిష్కరించాలని తెలిపారు. సమావేశంలో డీఆర్వో ఎం.వెం కటేశ్వరరావు, ఆర్డీవోలు సాయి ప్రత్యూష, కృష్ణమూర్తి, జడ్పీ సీఈవో శ్రీధర్ రాజా, సీపీవో ప్రసన్నలక్ష్మి, డీపీవో భారతిసౌజన్య, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్, పరిశ్రమల శాఖ జీఎం ఉమామహేశ్వరరావు, కోరాడ త్రినాథస్వామి పాల్గొన్నారు.
సైౖబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కోరారు. కలెక్టర్ కార్యాలయంలో జాతీయ ఇన్‌ఫర్మాటిక్స్ సెంటర్, సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడు తూ ఆర్థిక మోసాలు, డిజిటల్ అరెస్టులు, వక్తిత్వ హననం వంటి నేరాల వల్ల కలిగే శారీరక, మానసిక ఇబ్బందులను నివారించడానికి అప్రమత్తతే ఏకైక మార్గమని తెలిపారు. జిల్లా ఎన్‌ఐసీ అధికారి కిరణ్‌కుమార్ సురక్షిత ఇంటర్‌నెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సమాచార ఎన్‌ఐసీ విజయ్ బాలు, ఇంజనీర్ శ్రీరామ్ ప్రకాష్, ఈ-ఆఫీసు టెక్నికల్ అసోసియేట్ కిషోర్‌కుమార్ పాల్గొన్నారు.