'Technology Festival' ఉత్సాహంగా ‘సాంకేతిక ఉత్సవ్’
ABN , Publish Date - Mar 09 , 2025 | 12:16 AM
స్థానిక ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో జరుగు తున్న సాంకేతిక ఉత్సవ్ రెండో రోజు శనివారం ఉత్సాంగా జరిగింది.

ఎచ్చెర్ల, మార్చి 8(ఆంధ్రజ్యోతి): స్థానిక ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో జరుగు తున్న సాంకేతిక ఉత్సవ్ రెండో రోజు శనివారం ఉత్సాంగా జరిగింది. క్విజ్, టెక్నికల్ ఈవెంట్స్, ప్రాజెక్టుల ప్రదర్శన, పోస్టర్ల ప్రదర్శన చేపట్టారు. గుహవా టి ఐఐటీ ఆచార్యులు విజయసారధి, వీఎన్ ఐటీ నాగ్‌పూర్ మెకానికల్ విభా గానికి చెందిన డాక్టర్ అతుల్ రమేష్ బాలల్ వివిధ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. క్యాంపస్ డైరెక్టర్ బాలాజీ, ఏవో ముని రామకృష్ణ, అకడమిక్ డీన్ కొర్ల మోహన్ కృష్ణ, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.