Special BED Exam స్పెషల్ బీఈడీ పరీక్ష ప్రశ్నపత్రంలో తప్పిదం
ABN , Publish Date - Feb 14 , 2025 | 12:13 AM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో గురు వారం జరిగిన స్పెషల్ బీఈడీ ప్రథమ సెమిస్టర్ పరీక్ష ప్రశ్న పత్రంలో తప్పిదం చోటుచేసుకుంది.

40కి బదులు 80 మార్కులతో పేపరు ప్రచురణ
మూల్యాంకణంలో సరిచేస్తామంటూ కొనసాగించిన అధికారులు
ఆందోళనలో విద్యార్థులు
ఎచ్చెర్ల, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో గురు వారం జరిగిన స్పెషల్ బీఈడీ ప్రథమ సెమిస్టర్ పరీక్ష ప్రశ్న పత్రంలో తప్పిదం చోటుచేసుకుంది. అకడమిక్ షెడ్యూల్ ప్రకారం ఇంటర్‌డక్షన్ టు డిజేబులిటీస్ సంబంధించిన ఈ పరీక్ష గంటన్నర సమయంలో 40 మా ర్కులకుగాను విద్యార్థులు రాయాల్సి ఉంది. అయితే గురువారం ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు జరిగిన పరీక్షలో 80 మార్కుల ప్రశ్నలు ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. విద్యార్థులు 40 మా ర్కుల విధానంలో ప్రశ్నలకు జవాబు రాసేం దుకు సిద్ధం కాగా, 80 మార్కులకు పేపరు ఉండడంతో ఏ విధంగా రాయాలో అర్థం కాక అయోమయానికి గురయ్యారు. ప్రశ్నపత్రంలో తప్పిదం జరిగిందని తెలు సుకున్న అధికారులు దాన్ని సరిచేసేందుకు అవకాశం లేకపోవడంతో మూల్యాంకనం సమయంలో దీనిని సరిచేస్తామని చెప్పి గంటన్నర సమయంలోనే 80 మార్కులకు జవాబులు రాయించారు. ప్రశ్న పత్రం సరిగా తయారయ్యిందా లేదా అని కాన్ఫిడెన్షియల్ డీన్ తనిఖీ చేయకపో వడంతోనే తామంతా నష్టపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీజీ ఎగ్జామినేషన్ డీన్ డాక్టర్ ఉదయ్‌భాస్కర్ దృష్టికి రాగా బీవోఎస్ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లి ఈ సమస్యను పరిష్క రిస్తామన్నారు.