Erranna Naidu's ఎర్రన్నాయుడి సేవలు మరువలేనివి
ABN , Publish Date - Feb 24 , 2025 | 12:42 AM
దివం గత కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయు డి సేవలు మరువలేనివని కేంద్ర మంత్రి కింజ రాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
అరసవల్లి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): దివం గత కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయు డి సేవలు మరువలేనివని కేంద్ర మంత్రి కింజ రాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. నగరం లోని 80 అడుగుల రోడ్డులో ఉన్న టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు కలమట వెంక టరమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎర్రన్నాయు డి జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మా ట్లాడారు. తొలుత ఎర్రన్నాయుడి చిత్రపటాని కి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్ర మంలో ఎమ్మెల్యే గొండు శంకర్, నాయకులు మాదారపు వెంకటేష్, వెంకటరామరాజు, కవ్వాడ సుశీల తదితరులు పాల్గొన్నారు.
ఎర్రన్నాయుడు ఆశయ సాధనకు కృషి
నరసన్నపేట, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): దివంగత కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు ఆశయసాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. ఆదివారం ఎర్రన్నా యుడు జయంతి సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త బగ్గు అర్చన, శిమ్మ చంద్రశేఖర్, గొద్దు చిట్టిబాబు, మూకళ్ల చిన్నయ్య, బలగ భారతి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎర్రన్నాయుడి జయంతి నిర్వహించారు.