Share News

leprosy ప్రజా భాగస్వామ్యంతోనే కుష్ఠువ్యాధి నిర్మూలన

ABN , Publish Date - Jan 31 , 2025 | 12:12 AM

ప్రజా భాగస్వామ్యంతోనే కుష్ఠువ్యాధి నిర్మూలన సాధ్యమని డీఎంహెచ్‌వో డాక్టర్‌ బాలమురళీకృష్ణ అన్నారు.

leprosy   ప్రజా భాగస్వామ్యంతోనే కుష్ఠువ్యాధి నిర్మూలన
ప్రతిజ్ఞ చేస్తున్న డీఎంహెచ్‌వో తదితరులు

  • డీఎంహెచ్‌వో బాలమురళీకృష్ణ

అరసవల్లి, జనవరి 30(ఆంధ్రజ్యోతి): ప్రజా భాగస్వామ్యంతోనే కుష్ఠువ్యాధి నిర్మూలన సాధ్యమని డీఎంహెచ్‌వో డాక్టర్‌ బాలమురళీకృష్ణ అన్నారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ‘కుష్ఠు వ్యతిరేక దినం’ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. ఫిబ్రవరి 13 నుంచి 15 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా వైద్య సిబ్బంది జిల్లాలోని ప్రభుత్వ పా ఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో కుష్ఠువ్యాధిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా కుష్థువ్యాధి నిర్మూలనపై ప్రతిజ్ఞను చేయించారు. కార్యక్రమంలో డీఎల్‌వో డాక్టర్‌ శ్రీకాంత్‌, డీపీఎంవో వాన సురేష్‌ కుమార్‌, డీఎన్‌ఎంవో డాక్టర్‌ ప్రవీణ్‌, డెమో వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 31 , 2025 | 12:12 AM