Share News

Election 27న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక

ABN , Publish Date - Jan 31 , 2025 | 12:19 AM

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ వచ్చే నెల 27వ తేదీన నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు.

Election   27న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక

వచ్చే నెల 3న నోటిఫికేషన్‌.. అదే రోజునుంచి నామినేషన్ల స్వీకరణ

మార్చి 3 నుంచి కౌంటింగ్‌

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, జనవరి 30(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ వచ్చే నెల 27వ తేదీన నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. 24 గంటల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, పబ్లిక్‌ ప్రాంతాల్లో రాజకీయపరమైన పోస్టర్లు, ఫొటోలు తొలగించాలని సంబంధింత అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 3న నోటిఫికేషన్‌ విడుదల చేస్తామన్నారు. ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమమై 10వ తేదీ సాయంత్రం 3.00 గంటలతో ముగుస్తుందని పేర్కొన్నారు. 11న పరిశీలన, 13న ఉప సంహరణ ప్రక్రియ జరుగుతాయి. 27వ తేదీ ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందన్నారు. మార్చి 3న కౌంటింగ్‌ ప్రక్రి య ప్రారంభమై 8వ తేదీతో ఈ ప్రక్రియ ముగుస్తుంది. జనరల్‌ అభ్యర్థులు రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5వేలు ధరావత్తు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఫారం-26 ద్వారా అఫిడవిట్‌ సమర్పిం చాలని, సాధారణ ఎన్నికల మాదిరిగానే ఇప్పుడు కూడా అన్ని రకాల నిబం ధనలు అభ్యర్థులకు వర్తిస్తాయని పేర్కొన్నారు. తుది ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 4,829 మంది ఓటర్లు ఉండగా, వారిలో పురుషులు 3,275, మహిళా ఓటర్లు 1554 మంది ఉన్నారు. కాగా ఎన్నికల ప్రవర్తనా నియ మావళి పక్కాగా అమలు చేసేందుకు ఎంపీడీవో, వీడియోగ్రాఫర్‌తో కూడిన 30 ఎంసీసీ బృందాలను మండలానికి ఒకటి చొప్పు న నియమించామన్నారు. అలాగే మండలానికి ఒక తహసీల్దారు, ఎస్‌ఐ, వీడియోగ్రాఫర్‌తో కూడిన 30 ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

Updated Date - Jan 31 , 2025 | 12:19 AM