Share News

chiken: ‘ఎగ్‌’బడిన ‘మాంస’ప్రియులు

ABN , Publish Date - Feb 26 , 2025 | 12:07 AM

Egg lovers కోళ్లకు బర్డ్‌ఫ్లూ వ్యాధిపై ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించేందుకు మంగళవారం నరసన్నపేటలోని మారుతీనగర్‌ జంక్షన్‌ వద్ద ఓ కంపెనీ ఆధ్వర్యంలో ఉచిత చికెన్‌ మేళా నిర్వహించారు.

chiken: ‘ఎగ్‌’బడిన ‘మాంస’ప్రియులు
నరసన్నపేటలో చికెన్‌ మేళా వద్ద క్యూ కట్టిన ప్రజలు

  • నరసన్నపేట, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): కోళ్లకు బర్డ్‌ఫ్లూ వ్యాధిపై ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించేందుకు మంగళవారం నరసన్నపేటలోని మారుతీనగర్‌ జంక్షన్‌ వద్ద ఓ కంపెనీ ఆధ్వర్యంలో ఉచిత చికెన్‌ మేళా నిర్వహించారు. బర్డ్‌ఫ్లూ పై ప్రజల్లో అపోహలను తొలగించేందుకు 200 కేజీల చికెన్‌తో పలు రకాలు వంటకాలు, అలాగే 2వేలు ఉడికించిన గుడ్లను ఉచితంగా పంపిణీ చేశారు. వీటి కోసం జనం ఎగబడ్డారు. అధిక సంఖ్యలో ప్రజలు రావడంతో నిర్వాహకులు వారిని కట్టడి చేయలేకపోయారు. ఈ క్రమంలో తోపులాట జరిగి టెంట్లు కూడా పడిపోయాయి. కాగా.. బర్డ్‌ఫ్లూ భయంతో చికెన్‌, గుడ్లు కొనేందుకు వెనుకంజ వేస్తున్న ప్రజలు.. మేళాకు మాత్రం పెద్ద ఎత్తున రావడం చర్చనీయాంశమైంది.

Updated Date - Feb 26 , 2025 | 12:07 AM