Education విద్యకు పెద్దపీట
ABN , Publish Date - Jan 03 , 2025 | 11:55 PM
విద్యార్థుల్లో సృజనాత్మతను వెలికి తీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు దోహదపడతాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన జిల్లాస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్
ముగిసిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు
గుజరాతీపేట, జనవరి 3(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో సృజనాత్మతను వెలికి తీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు దోహదపడతాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన జిల్లాస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందన్నారు. విద్య కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్ లు, యూనిఫారాలు అందిస్తుందని గుర్తుచేశారు. మం డల, జిల్లా, రాష్ట్రస్థాయిలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం గొప్ప విషయమ న్నారు. కార్యక్రమంలో డీఈవో ఎస్.తిరుమల చైతన్య, ఏపీసీ శశిభూషణ్‌రావు, డిప్యూటీ డీఈ వోలు ఆర్.విజయకుమారి, విలియమ్స్, జిల్లా సైన్స్ అధికారి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సందర్శించి ప్రాజెక్టులను పరిశీలించారు.
విజేతలు వీరే..
వ్యక్తిగత విభాగంలో జస్వంత్ పాత్రో (జీహెచ్‌ఎస్, పలాస) ప్రథమ బహుమతి, పి.దీపక్‌కుమార్ (ఏపీఎం ఎస్, పురుషోత్తపురం) ద్వితీయస్థానం సాధించారు. గ్రూప్ విభాగంలో అంపోలు దీపక్, ఎ.శివ హరీష్ (ఎంజేపీఏపీబీసీడబ్ల్యూఆర్‌ఎస్, సంతబొమ్మాళి)కు ప్రథమ స్థానం, ఎ.దమయంతి, బి.శరణ్యశ్రీ (జడ్పీహెచ్‌ఎస్ ఎస్‌ఎస్‌ఆర్ పురం) ద్వీతీయస్థానంలో నిలిచారు. అదే విధంగా ఉపాధ్యాయుల విభాగంలో బి.వెంకటరమణ (జడ్పీహెచ్‌ఎస్, మెట్టక్కివలస) ప్రఽథమస్థానం, కె.శ్యా మసుందరరావు (ఈహెచ్‌ఎస్, శ్రీకాకుళం) ద్వితీయ స్థానంలో నిలిచారు.