Share News

Swatcha Andhra జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛఆంధ్ర-స్వచ్ఛ దివస్‌

ABN , Publish Date - Jan 18 , 2025 | 11:54 PM

Swatcha Andhra రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం జిల్లా వ్యాప్తంగా ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛదివస్‌’ కార్యక్ర మాలు నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, పాఠశాలల ఆవరణలు పరిశుభ్రం చేసి మొక్కలు నాటారు. కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Swatcha Andhra జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛఆంధ్ర-స్వచ్ఛ దివస్‌
కవిటి: ఆసుపత్రి ఆవరణలో శుభ్రం చేస్తున్న విప్‌, ఎమ్మెల్యే అశోక్‌

రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం జిల్లా వ్యాప్తంగా ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛదివస్‌’ కార్యక్ర మాలు నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, పాఠశాలల ఆవరణలు పరిశుభ్రం చేసి మొక్కలు నాటారు. కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యం: ఎంజీఆర్‌

పాతపట్నం, జనవరి 18(ఆంధ్రజ్యోతి): పరిస రాల పరిశుభ్రతతో ఆరో గ్యం సిద్ధిస్తుందని, దీనిని ప్రతి ఒక్కరూ ఆచరిం చాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నంలో శనివారం స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ దివస్‌’ నిర్వహించారు. ప్రతీనెలా 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా అధికారులు, నేతలతో ప్రతిజ్ఞ చేయించారు. కోర్టుకూడలి నుంచి సబ్‌జైల్‌ సిబ్బంది క్టార్టర్స్‌ వరకు పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి డా.మంచు కరుణాకరరావు తహసీల్దార్‌ ఎన్‌.కిరణ్‌ కుమార్‌, ఎంపీడీవో పి.చంద్రకుమారి తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛ ఆంధ్రలో భాగస్వాములు కావాలి: అశోక్‌

కవిటి, జనవరి18 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌ కార్యక్ర మంలో ప్రతి ఒక్కరూ భాగస్వా ములు కావాలని ఇచ్చాపురం ఎమ్మె ల్యే, ప్రభుత్వ విప్‌ బి.అశోక్‌ కోరారు. కవిటి ప్రభుత్వాసుపత్రి ఆవరణలో స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌లో భా గంగా మొక్కలు నాటారు. అనం తరం సహలాల పుట్టుగలో నిర్మిం చిన రోడ్డును ప్రారంభించారు. కార్యక్ర మంలో తహసీల్దార్‌ కె.మురళీ మోహ నరావు, ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, ఏపీడీ సీహెచ్‌ శ్రీనివాసరెడ్డి, ఏపీఎం గోవిందు, జనసేన నేతలు దాసరి రాజు, ఎల్‌.రాజేష్‌ పాల్గొన్నారు.

కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచాలి: ఎన్‌ఈఆర్‌

రణస్థలం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కార్యాలయాలను పరి శుభ్రంగా ఉంచుకోవా లని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వర రావు, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ కోరారు. శనివారం రణ స్థలం ఎంపీడీవో కార్యాల యం ప్రాంగణంలో తుప్పలను తొలగించి పరిశుభ్రం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎం.ఈశ్వరరావు, ఈవోపీఆర్డీ ప్రకాశరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

పరిశుభ్రతలో రోల్‌ మోడల్‌ కావాలి: శంకర్‌

శ్రీకాకుళం రూరల్‌/శ్రీకాకుళం కల్చరల్‌/అరసవల్లి, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): పరిశుభ్రతలో రాష్ట్రం దేశా నికే రోల్‌ మోడల్‌గా నిల వాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌ కోరారు. మండలంలోని కళ్లేపల్లిలోని సంప్ర దాయ గురుకులం, శ్రీకాకుళం నగరంలోని తెలుగు ముస లయ్య కాలనీల్లో స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌ని నిర్వహించారు. కమిషనర్‌ ప్రసాద్‌, ఎంపీడీవో బి.శైలజ, ఈవోపీఆర్డీ సూర్యనారాయణ, టీడీపీ నాయకులు మూకళ్ల శ్రీనివాసరావు, సూరాడ సూర్యం, మైలపల్లి నర్శింహమూర్తి, దశరఽథ్‌, చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలి: జడ్పీ సీఈవో

నందిగాం, జనవరి 18(ఆంధ్రజ్యోతి): గ్రామాలను స్వచ్ఛత గ్రామాలుగా తీర్చిదిద్ది ఆరోగ్య సమాజాన్ని స్థాపించా లని జడ్పీ సీఈవో శ్రీధర్‌ రాజా అన్నారు. శనివారం స్వచ్ఛఆంధ్ర, స్వచ్ఛదివస్‌లో భాగంగా మండల కార్యాలయ ఆవరణ లో స్వచ్ఛత కార్యక్రమాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో టి.రాజారావు, తహసీల్దార్‌ పి.సోమేశ్వరరావు, ఏపీఎం మనోరత్నం, వైద్యాధికారులు అనితకుమారి, సుకన్య, అంజలి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2025 | 11:54 PM