MISSING యువకుడి అదృశ్యం
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:13 AM
పాలవలస గ్రామానికి చెందిన అల్లాడ శంకర్ (30) ఈ నెల మూడో తేదీ నుంచి కనిపించడం లేదని కుటుం బ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ ప్రవల్లిక తెలిపారు.

బూర్జ, మార్చి 6(ఆంధ్రజ్యోతి): పాలవలస గ్రామానికి చెందిన అల్లాడ శంకర్ (30) ఈ నెల మూడో తేదీ నుంచి కనిపించడం లేదని కుటుం బ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ ప్రవల్లిక తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. శంకర్ శ్రీకాకుళంలోని ఓ మోటారు ఫైనాన్స్ కంపెనీలో లోన్ మేనేజ ర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో చాలా వరకు అప్పులు చేశాడు. అప్పులు ఇచ్చినవారి ఒత్తిడి తట్టుకోలే ఇళ్లు వదిలి వెళ్లిపోయి ఉంటాడని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఐ తెలిపారు.