Share News

Death of a child ఉసురుతీసిన చేగొడి

ABN , Publish Date - Feb 14 , 2025 | 12:14 AM

చేగొడి ఓ చిన్నారి ఉసి రితీసింది. గొంతులో ఇరుక్కొని ఊపిరాడక ఆ చిన్నారి మృతి చెందిన ఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది.

Death of a child ఉసురుతీసిన చేగొడి
చిన్నారి మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

  • గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి

  • లంకపేటలో విషాదం

రణస్థలం, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): చేగొడి ఓ చిన్నారి ఉసి రితీసింది. గొంతులో ఇరుక్కొని ఊపిరాడక ఆ చిన్నారి మృతి చెందిన ఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రావాడ పంచాయతీ లంకపేట గ్రామానికి చెందిన కిల్లారి ఈశ్వరరావు, శ్రీదేవి భార్యభర్తలు. వీరికి కుమారుడు ఢిల్లీశ్వరరావు, ఏడాదిన్నర వయసు గల పాప సోణాక్షిత ఉన్నారు. పిల్లలతో వారి జీవితం సంతోషంగా సాగిపోతుంది. ఈ క్రమంలో గురువారం తల్లి శ్రీదేవి ఇంటి పనులు చేస్తున్న సమయంలో పాప సోణాక్షితకు చెగొడి ఇచ్చింది. దీన్ని తినే క్రమంలో ఆ చిన్నారి గొంతులోకి అడ్డంగా ఉండిపోయింది. దీంతో ఊపిరాడక త్రీవ అస్వస్థతకు గురైంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కొండములగాం కమ్యూనిటీ ఆసుపత్రికి తీసు కొచ్చారు. అయితే అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదన వర్ణణాతీతం. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Updated Date - Feb 14 , 2025 | 12:14 AM