Share News

Current bill డోర్‌ లాక్‌ పేరిట కరెంట్‌ బిల్లు మోత

ABN , Publish Date - Feb 27 , 2025 | 12:18 AM

ఈ ఏడాది విద్యుత్‌ చార్జీలు పెంచేది లేదని ఓ వైపు కూట మి ప్రభుత్వం చెబుతుంటే.. మరో వైపు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో విద్యుత్‌ శాఖాధికారులు అదనపు బిల్లులతో ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారు.

Current bill  డోర్‌ లాక్‌ పేరిట కరెంట్‌ బిల్లు మోత
డోర్‌లాక్‌ పేరిట రూ.వేలల్లో విద్యుత్‌ బిల్లు

  • వినియోగదారులకు అధిక మొత్తంలో బిల్లు

  • ఇంటికి తాళం వేశారని చెబుతున్న వైనం

  • నిలదీస్తే న్యాయం.. లేకుంటే జేబులు ఖాళీ

శ్రీకాకుళం క్రైం, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది విద్యుత్‌ చార్జీలు పెంచేది లేదని ఓ వైపు కూట మి ప్రభుత్వం చెబుతుంటే.. మరో వైపు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో విద్యుత్‌ శాఖాధికారులు అదనపు బిల్లులతో ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారు. గతంలో రెం డు నెలలకోసారి వచ్చే కరెంట్‌ బిల్లు గత వైసీపీ ప్రభు త్వం చలువతో ప్రతీ నెలా వసూలు చేస్తుంది. దీనికి అలవాటుపడిన ప్రజలకు కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత విద్యుత్‌ చార్జీల బాదుడు నుంచి ఉపసమనం కలిగించింది. అయితే విద్యుత్‌ అధికారులు, కరెంట్‌ రీడింగ్‌లు తీసే వారి నిర్లక్ష్యంతో డోర్‌లాక్‌ పేరిట అధిక మొత్తం బిల్లు వేస్తున్నారు. జిల్లాలో ప్రతీనెలా 2వ తేదీ నుంచి 12వ తేదీ నాటికి ఇంటింటికి వెళ్లి కరెంట్‌ బిల్లులు రీడింగ్‌ తీస్తుంటారు. ఈ బిల్లును నెలాఖరులోగా చెల్లించా ల్సి ఉంటుంది. అయితే ఈ బిల్లులు తీసే బాధ్యత ఏపీఈపీడీసీఎల్‌ ఓ ప్రైవేట్‌ సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ కొంత మంది యువతను నియమించి వారితో ప్రతీ ఇంటికి కరెంట్‌ బిల్లుల రీడింగ్‌ తీయిస్తుంది. ఒక రోజుకు ఓ వ్యక్తి ఎన్ని రీడింగ్‌లు తీస్తే అంత కమీషన్‌ రూపంలో వేతనా లు ఇస్తుంది. అయితే ప్రతీ నెలా 16వ తేదీ వరకు కూడా బిల్లులు తీయడం లేదన్న వి మర్శలు వినిపిస్తున్నాయి. ఇంటికి రీడింగ్‌ తీసే సమయంలో వినియోగదారుల వద్ద బిల్లు కు రెండు రూపాయలు చొప్పున వసూలు చేస్తుంటారు. ఇలా ప్రతీ నెలా కరెంట్‌ బిల్లు లు జనరేట్‌ చేస్తుంటారు.

తాళం వేస్తే రీడింగ్‌ తీయరు..

వినియోగదారులు ఎంత కరెంట్‌ వినియో గిస్తే అంత బిల్లు రావడం సహజం. కానీ కరెంట్‌ వినియోగించకపోయినా వేల రూపా యలు బిల్లులు వినియోగదారులు చెల్లించే పరిస్థితి నెలకొంది. ప్రతీనెలా కరెంట్‌ రీడింగ్‌ తీసేందుకు వచ్చే బోయ్‌ల నిర్లక్ష్యంతో వినియోగదారులపై బిల్లుల భారం పడుతుంది. రీడింగ్‌ బోయ్‌ ఇంటికి వచ్చేట ప్పుడు డోర్‌లాక్‌ చేసుంటే ఇక అంతే సంగతి. రీడింగ్‌ తీసే వ్యక్తి డోర్‌లాక్‌ అని బిల్లు కొట్టడంతో రూ.500 నుంచి రూ.1000 రావాల్సిన బిల్లు రెండు వేల నుంచి నాలు గు వేల రూపాయలు వరకు వస్తుంది. నిజానికి ఇంట్లో మీటర్‌ ఉండి రీడింగ్‌ తీయ డానికి ఇబ్బంది కలిగితే డోర్‌ లాక్‌ బిల్లు వచ్చిందంటే ఆలోచించొచ్చు. కానీ అపార్ట్‌మెంట్‌లకు సైతం కరెం ట్‌ బిల్లులు డోర్‌లాక్‌ రూపంలో వేలల్లో రావడం సర్వత్రా విమర్శల కు తావిస్తుంది. ఇటీవల ఫరీద్‌పేట సమీపంలో ఉషోదయ నగర్‌ వద్ద ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న వారందరికి డోర్‌లాక్‌ పేరుతో కరెం ట్‌ బిల్లులు జనరేట్‌ చేశారు. అయితే ప్రతీ నెల రూ.500 నుంచి రూ.800 వచ్చే కరెంట్‌ బిల్లు ఒక్క సారిగా రూ.2099 రూపాయలు రావడంతో వినియోగదారులు ఆందోళ నకు గురవుతున్నారు. ఇదేంటని విద్యుత్‌ శాఖాధికా రులను ప్రశ్నిస్తే డోర్‌లాక్‌ బిల్లు వచ్చిందంటూ సమాధానం చెప్పడం విశేషం. లైన్‌మన్‌ను అపార్ట్‌మెంట్‌కు డోర్‌లాక్‌ అని ఎలా బిల్లు కొట్టారని ప్రశ్నిస్తే సమధానం కరువైంది. వినియోగదారుడు నిలదీయడం తోహడావుడిగా బిల్లు అప్డేట్‌ చేసి మళ్లీ రీడింగ్‌ తీయించి రూ.837 బిల్లును ఇచ్చారు. అలాగే పీఎన్‌ కాలనీలో కూడా ఇదే తరహాలో డిసెంబరు, జనవరి నెలల బిల్లులు డోర్‌లాక్‌ రూపంలో రూ.4308 ఇవ్వడంతో ఓ వినియోగదారుడు విద్యుత్‌ శాఖాధికారులకు అర్జీ పెట్టుకున్నాడు. తన ఇల్లు రెండు నెలలుగా ఖాళీగా ఉన్నా.. వేల రూపాయలు బిల్లు వచ్చిందని తగ్గించాలని విన్న వించుకున్నా వచ్చిన బిల్లు చె ల్లించాల్సిందేనని చెప్పడంతో గ త్యంతరం లేక చెల్లించాడు. ఇలా జిల్లా వ్యాప్తంగా డోర్‌ లాక్‌ బిల్లులతో విని యోగదారులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.

సమస్య మా దృష్టికి తెస్తే బిల్లులో మినహాయిస్తాం

ఇంటి లోపల మీటర్‌ ఉన్నప్పుడు.. వినియోగదారులు ఇతర ప్రాంతాలకు మైగ్రేట్‌ అయినప్పుడు డోర్‌లాక్‌ బిల్లు వేస్తాం. అది కూడా పాత మూడు నెలల బిల్లు యావరేజ్‌గా తీసుకుని బిల్లు వేస్తాం. అపార్ట్‌మెంట్‌లకు డోర్‌లాక్‌ బిల్లులు వేస్తున్నట్టు మా దృష్టికి రాలేదు. డోర్‌లాక్‌లో వేల రూపాయలు బిల్లు వేస్తే కార్యాలయ అధికారులను కానీ నేరుగా ఎస్‌ఈని సంప్రదిస్తే తర్వాత బిల్లులో మినహాయిస్తాం. ప్రతీ నెలా 2వ తేదీన కాంట్రాక్టర్‌తో బిల్లు రీడింగ్‌ల విషయంలో సమావేశం నిర్వహి స్తున్నాం. ఇకపై ఇలా అపార్ట్‌మెంట్‌లో ఇళ్లకు డోర్‌లాక్‌లో అధిక బిల్లులు వేస్తే కాం ట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటాం.

- సురేష్‌, ఈఈ, విద్యుత్‌శాఖ

Updated Date - Feb 27 , 2025 | 12:18 AM