CRPF సీఆర్‌పీఎఫ్ హెచ్‌సీ మృతి
ABN , Publish Date - Jan 06 , 2025 | 11:59 PM
CRPF మండలంలోని తోలాపిలో సీఆర్ పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ బొనిగి రమణారావు అంత్యక్రియలు సోమవారం నిర్వహించారు.

పొందూరు, జనవరి6 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని తోలాపిలో సీఆర్ పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ బొనిగి రమణారావు అంత్యక్రియలు సోమవారం నిర్వహించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల కథనం మేరకు... తోలాపికి చెందిన రమణారావు (54) ప్రస్తుతం చత్తీస్‌ఘడ్‌లోని సీఆర్ పీఎఫ్ 19 వ బెటాలియన్‌లో హెచ్‌సీగా పనిచేస్తున్నారు. మూడురోజుల సెలవుపై ఇంటికి వచ్చిన ఆయన సోమవారం ఉదయం బాత్‌రూంకు వెళ్లి గుండె పోటుకు గురై పడిపోయాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆసు పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయనకు భార్య జ్యోతి, ఇద్దరు కుమారులున్నారు. రమణారావు మృతిచెందిన సమా చారం అందడంతో సీఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ పి.తిరుమల, సిబ్బంది చాంద్, రాజేష్ పాండే, దేవానంద్, పి.సెంథిల్, ఆర్‌బీ అతుల్ తదితరులు చేరుకున్నారు. ఈ మేరకు సీఆర్‌పీఎఫ్ అధికార లాంఛనాలతో సోమవారం తోలాపిలో అంత్యక్రియలు నిర్వహించారు.