నదిలో కోళ్ల వ్యర్థాలతో ఆందోళన
ABN , Publish Date - Feb 19 , 2025 | 11:43 PM
పాతపట్నం మండలం కమలమ్మ కొట్టు కూడలిలో మహేంద్ర తనయ నదిలో కోళ్ల వ్యర్థాలను పడే యడంపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాతపట్నం/హిరమండలం, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): పాతపట్నం మండలం కమలమ్మ కొట్టు కూడ లిలో మహేంద్ర తనయ నదిలో కోళ్ల వ్యర్థాలను పడే యడంపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నదీ జలాలు తక్కువగా ఉన్నాయని, వాటిలో ఇలా వ్యర్థాలను వేయడం వల్ల నీరు కలుషితమై అనా రోగ్యం బారిన పడతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క బర్డ్‌ఫ్లూ వ్యాధి సోకుతోందన్న ప్రచారం జరుగుతున్న సమయంలో ఇలా కోళ్ల వ్యర్థా లను నదిలో పడేసిన వైనాన్ని స్థానికులు బుధవారం గుర్తించారు. కొరసవాడకు చెందిన ఒక వ్యక్తి ఈ పనికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. నదిలో కోళ్ళ వ్యర్థాలతో దుర్గంధం వెదజల్లుతోందని, దీంతో ఇబ్బం దులు పడుతున్నామని పేర్కొంటున్నారు. ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు ధనుపురం సర్పంచ్ దారపు ఢిల్లేశ్వరరావు తెలిపారు.