Share News

land dispute స్థల వివాదంపై ఇరువర్గాల ఫిర్యాదు

ABN , Publish Date - Mar 05 , 2025 | 11:56 PM

land dispute పట్టణ పరిధి స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న ఖాళీగా ఉన్న స్థలం వివాదాస్పదంగా మారింది. ఈ స్థలం మాదంటే మాదని స్థానికులు, రియల్‌ వ్యాపారులు ఘర్షణ పడి ఇరువర్గాలవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

land dispute   స్థల వివాదంపై ఇరువర్గాల ఫిర్యాదు

ఇచ్ఛాపురం, మార్చి 5(ఆంధ్రజ్యోతి): పట్టణ పరిధి స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న ఖాళీగా ఉన్న స్థలం వివాదాస్పదంగా మారింది. ఈ స్థలం మాదంటే మాదని స్థానికులు, రియల్‌ వ్యాపారులు ఘర్షణ పడి ఇరువర్గాలవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయం ఎదురుగా గిలాయి వీధిలో నివాసం ఉంటున్న కొంతమందికి సంబంధించి వారి ఇళ్ల పెరటిలో ఉన్న నేలబావులను రియల్‌ వ్యాపారులు పూడ్చేందుకు సిద్ధమయ్యారు. ఆ బావులు మావని, వాటిని పూడ్చడం కుదరదని ఇంటి యజమానులు వారితో ఘర్షణ పడ్డారు. దీనిపై టౌన్‌ ఎస్‌ఐ ముకుందరావును వివరణ కోరగా.. తహ సీల్దార్‌కు పంపించామని, పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోరినట్టు తెలిపారు.

పుస్తెలతాడు అపహరణ

కొత్తూరు, మార్చి 5(ఆంధ్రజ్యోతి): మదనాపురం గ్రామానికి చెందిన అగతముడి కళావతి మెడలో ని బంగారు పుస్తెల తాడును గుర్తు తెలియని వ్యక్తి అపహరించుకుపోయారని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎండి అమీర్‌ ఆలీ తెలిపారు. మంగళవారం రాత్రి ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలి యని వ్యక్తి మెడలో ఉన్న తులం పుస్తెల తాడును బల వంతంగా తెంపుకొని పారిపోయాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. ఈ మేరకు కేసు నమోదే చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Mar 05 , 2025 | 11:56 PM