అర్హులందరికీ పరిహారం: ఆర్డీవో
ABN , Publish Date - Jan 30 , 2025 | 11:53 PM
మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు పరిధిలోని చెట్లకు సంబంధించి అర్హులైన బాధిత రైతులందరికీ పరిహారం అందజేస్తామని ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి తెలిపారు.

టెక్కలి,జనవరి 30(ఆంధ్రజ్యోతి):మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు పరిధిలోని చెట్లకు సంబంధించి అర్హులైన బాధిత రైతులందరికీ పరిహారం అందజేస్తామని ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి తెలిపారు. గురువారం టెక్కలి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో మూ లపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు పరిధిలోని రైతులకు సంబంధించిన జిరాయితీ, రెవెన్యూ, పోరంపోగు పరిధిలో పడిన చెట్లకు పరిహారం అందించాలని రైతులు ఆర్డీవోను కలిసి కోరారు.తాము పెంచిన చెట్ల వల్ల ఫలసాయం పొందుతున్నామని, చెట్లు ఉన్నచోట డ్రెడ్జింగ్ పనుల వల్ల ఉప్పునీరు వస్తుండడంతో నష్టం వాటిల్లుతుండ డంతో ఆదుకోవాలని రైతులు అప్పలస్వామి, గణేష్, సింహాచలం కోరారు. ఇప్పటికే రెవెన్యూ పోరంపోగులో ఉన్న చెట్టుకు రూ.1,300లు, రెవెన్యూ పరిధిలో ఉన్న చెట్టుకు రూ.2,600లు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదన చేశామని, నిధు లు మంజూరైతే బాధితులకు అందజేస్తామని ఆర్డీవో తెలిపారు.