Share News

Colleges Anniversary ఆనందోత్సాహాల నడుమ కళాశాలల వార్షికోత్సవాలు

ABN , Publish Date - Feb 21 , 2025 | 11:57 PM

Colleges Anniversary జిల్లాలో శుక్రవారం పలు కళాశాలల వార్షికోత్సవాలు, ఫేర్‌వెల్‌ కార్యక్రమాలు వేడుకగా నిర్వహించారు. కొత్తూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల స్వర్ణోత్సవాలు ఆనందోత్సాహాల నడుమ జరిగాయి. విద్యార్థినీ విద్యార్థుల సాంస్కృతి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

Colleges Anniversary ఆనందోత్సాహాల నడుమ  కళాశాలల వార్షికోత్సవాలు
కొత్తూరు: నృత్యాభినయం చేస్తున్న విద్యార్థినులు

కళాశాల అభివృద్ధికి సహకరించాలి

డీఈవో తిరుమల చైతన్య

వేడుకగా జూనియర్‌ కళాశాల స్వర్ణోత్సవం

జిల్లాలో శుక్రవారం పలు కళాశాలల వార్షికోత్సవాలు, ఫేర్‌వెల్‌ కార్యక్రమాలు వేడుకగా నిర్వహించారు. కొత్తూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల స్వర్ణోత్సవాలు ఆనందోత్సాహాల నడుమ జరిగాయి. విద్యార్థినీ విద్యార్థుల సాంస్కృతి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

కొత్తూరు, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): కళాశాల స్వర్ణోత్సవం నిర్వహించడం ఆనం దంగా ఉందని, సంస్థ అభివృద్ధికి పూర్వ విద్యార్థులు సహకరించాలని డీఈవో తిరు మల చైతన్య అన్నారు. కొత్తూరు జూనియర్‌ కళాశాల గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవం శుక్ర వారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఈవో మాట్లాడు తూ.. ధనంతో ఎవరినైనా కొనవచ్చని, కాని సరస్వతీ దేవిని కొనలేరన్నారు. కళాశాల ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిందని, ఈ కళాశాలలో చదివి ఎందరో ఉన్నత స్థాయిల్లో ఉన్నారని, వారంతా కళాశాల అభివృద్ధికి కృషి చేసి రుణం తీర్చుకోవాలన్నారు. పూర్వ విద్యార్థులంతా ఒకచోట కలియడం అదృష్టంగా భావించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇక్కడ చదువులు సాగించిన విద్యార్థులందరూ కలిసి ఆప్యాయంగా పలుకరించుకుని ఒకరికొకరు శుభా కాంక్షలు చెప్పుకుంటూ ఆనందంగా ఉండడంతో అక్కడ అంతా పండగ వాతావరణం కనిపించింది. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ బండారు రవికుమార్‌, కొత్తూరు ఉన్నత పాఠశాల హెచ్‌ఎం గోవిందరావు, రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు ఎద్దు దాసు నాయుడు, అధ్యాపకులు పాల్గొన్నారు.

ప్రణాళికాబద్ధంగా చదవాలి

నరసన్నపేట, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ పరీక్షలు సమీపిస్తున్నందున ప్రణాళికాబద్ధంగా చదివి మంచి ప్రతిభ కనబరచాలని జూనియర్‌ కళాశాల ప్రిన్సి పాల్‌ ఎం.పవన్‌ అన్నారు. శుక్రవారం కళాశాల వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్య క్రమంలో రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ వి.నారాయణస్వామి, పైడి వెంకటరావు, సువ్వారి శ్రీనివాసరావు, లక్ష్మి, తారక్‌ తదితరులు పాల్గొన్నారు.

సమయాన్ని వృథా చేయొద్దు

వజ్రపుకొత్తూరు, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులు సమ యాన్ని వృథా చేయకుండా సంసిద్ధం కావాలని గోవిందపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కె.రమేష్‌ పట్నాయక్‌ అన్నారు. కళాశాలలో శుక్రవారం విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ప్రణాళికాబద్ధంగా ముం దుకు వెళితే అత్యధిక మార్కులు సంపాదించవచ్చన్నారు. అనంతరం అధ్యాపకు లను సత్కరించారు. విద్యార్థుల సాంస్కృతి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో హెచ్‌ఎంలు సీతరాజు, చంద్రశేఖర్‌, తిరుపతిరావు, అధ్యాపకులు పాల్గొన్నారు.

లక్ష్యాల దిశగా నడిపించేది విద్య

పాతపట్నం, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): లక్ష్యాల దిశగా నడిపించేది విద్య అని, ప్రాథమిక స్థాయి నుంచి దీనిపై శ్రద్ధ వహించాలని వక్తలు అన్నారు. స్థానిక విజ్ఞాన్‌ స్కూల్‌లో శుక్రవారం ఫేర్‌వెల్‌ డే నిర్వహించారు. స్కూల్‌ కరస్పాండెంట్‌ ఎం.గంగా ధర్‌ మాట్లాడుతూ.. అభిరుచికి తగిన లక్ష్యాలను నిర్దేశించు కోవాలన్నారు. ఈ సంద ర్భంగా విద్యార్థినీ విద్యార్థులు చేసిన పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్ర మంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

వేడుకగా కళాశాల వార్షికోత్సవం

కంచిలి, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వార్షికో త్సవం, ఫేర్‌వెల్‌ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గతేడాది కళాశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు సిరివెన్నెల, సరిత, మీనాక్షిలకు నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ వి.జగదీష్‌కుమార్‌, జడ్పీ హైస్కూల్‌ హెచ్‌ఎం సీత, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Feb 21 , 2025 | 11:57 PM