Marpu మార్పు పద్మనాభాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
ABN , Publish Date - Jan 16 , 2025 | 12:09 AM
Marpu రైతాంగ ఉద్యమంలో వీరోచితంగా పోరాడిన తొలితరం కమ్యూనిస్టు నేత మార్పు పద్మనాభం ఆదర్శనీయుడని వామపక్ష నేతలు అన్నారు.

కాశీబుగ్గ/హరిపురం, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): రైతాంగ ఉద్యమంలో వీరోచితంగా పోరాడిన తొలితరం కమ్యూనిస్టు నేత మార్పు పద్మనాభం ఆదర్శనీయుడని వామపక్ష నేతలు అన్నారు. మార్పు పద్మనాభం 59వ వర్ధంతి కార్యక్రమాలను బుధవారం కాశీబుగ్గ, హరిపురంలో నిర్వహిం చారు. ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ.. రైతు సమస్యల పరిష్కా రంలో ఉద్యమ వైతాళికుడిగా మార్పు నిలిచారని, పుల్లెల శ్యాంసుందరరావు నాయకత్వంలో రైతు ఉద్యమంలో మార్పు పద్మనాభం పాత్ర మరువలేని దన్నారు. జమిందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన బళ్లారిలో జైలుశిక్ష అనుభవించిన వ్యక్తి పద్మనాభం అని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని సమస్య లపై పోరాటం చేయాలని కోరారు. కార్యక్రమాల్లో వామపక్షాల నాయకులు సీహెచ్.వేణుగోపాల్, టి.సన్యాసిరావు, జుత్తు వీరాస్వామి, అజయ్‌కుమార్, మద్దిల రామారావు, మార్పు ట్రస్ట్ అధ్యక్షుడు మట్ట ఖగేశ్వరరావు, కంసు కృష్ణ మూర్తి, నల్ల హడ్డీ, పుచ్చ దుర్యోధన, ఉగ్రిపెల్లి సోమనాఽథం తదితరులు పాల్గొన్నారు.