చీడిపూడిలో చక్రతీర్థ స్నానాలు
ABN , Publish Date - Feb 12 , 2025 | 11:43 PM
సారవకోట మండలంలోని చీడిపూడిలో వేంకటేశ్వరస్వామి చక్రతీర్థ స్నానాలు బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈనెల ఎనిమిదో తేదీ నుంచి జరుగుతున్న ఉత్సవాలు ఆఖరి రోజు వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగమ్మ, పద్మావతి ఉత్సవ విగ్రహాలకు అలంకరించి అవలింగి, చీడిపూడిల్లో గ్రామోత్సవం నిర్వహించారు.

జలుమూరు, (సారవకోట) ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): సారవకోట మండలంలోని చీడిపూడిలో వేంకటేశ్వరస్వామి చక్రతీర్థ స్నానాలు బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈనెల ఎనిమిదో తేదీ నుంచి జరుగుతున్న ఉత్సవాలు ఆఖరి రోజు వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగమ్మ, పద్మావతి ఉత్సవ విగ్రహాలకు అలంకరించి అవలింగి, చీడిపూడిల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయం నుంచి గ్రామోత్సవం నిర్వహించి అచ్చెన్నాయుడు చెరువులో ఉత్సవ విగ్రహాలకు చక్రతీర్థ స్నానాలు ఆచరించారు.