Share News

investigation సమగ్ర దర్యాప్తుతో కేసులు ఛేదించాలి

ABN , Publish Date - Feb 13 , 2025 | 12:15 AM

సమగ్రమైన దర్యా ప్తుతో ప్రాపర్టీ కేసులు త్వరితగతిన ఛేదించి, రికవరీ శాతాన్ని పెం చాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అధికారులకు దిశా నిర్ధేశం చేశా రు.

investigation  సమగ్ర  దర్యాప్తుతో కేసులు ఛేదించాలి
వర్చువల్‌లో మాట్లాడుతున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

ఎస్పీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం క్రైం, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): సమగ్రమైన దర్యా ప్తుతో ప్రాపర్టీ కేసులు త్వరితగతిన ఛేదించి, రికవరీ శాతాన్ని పెం చాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అధికారులకు దిశా నిర్ధేశం చేశా రు. నేర నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని, అందు వల్ల గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని సూచిం చారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వర్చువల్‌లో జిల్లా వ్యాప్తంగా ఉన్న డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో ఎస్పీ సమీ క్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో జరిగిన దొంగతనాలు, పెండిం గ్‌ కేసులపై ఎస్పీ ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. కేసుల దర్యాప్తులో భాగంగా ఇటీవల జైలు నుంచి విడుదలైన నేరస్తుల కదలికలు, సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కేసులను ఛేదించాల న్నారు. ముఖ్యంగా మహిళలపై జరిగిన దాడి కేసుల్లో బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలన్నారు. పెట్రోలింగ్‌, రాత్రి గస్తీ పటిష్టంగా నిర్వహించాలని, మైనర్‌ డ్రైవింగ్‌లపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ చేయాలన్నారు. సమావేశంలో సీఐలు శ్రీనివారావు, శ్రీనివాస్‌, ఎస్‌ఐలు కోటేశ్వరరావు, గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

కారుణ్య నియామకపత్రం అందజేత

అనారోగ్యంతో ఈ ఏడాది మరణించిన హోంగార్డు శ్రీనివాసరావు భార్య కె.ఉదయకుమారికి జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి కారుణ్య నియామకపత్రాన్ని అందజేశారు. అలాగే ఇటీవల మరణించిన మరో హోంగార్డు ఎం.గోవిందరావు సతీమణి నాగరత్నమ్మకు తోటి హోంగార్డుల ఒక్కరోజు గౌరవ వేతనం రూ.4.06లక్షలు చెక్కును ఎస్పీ అందించారు. కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ ఎల్‌.శేషాద్రి, డీపీవో ఏవో సీహెచ్‌ గోపినాథ్‌, ఆర్‌ఎస్‌ఐ వెంకటరమణ, క్లర్క్‌ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2025 | 12:15 AM