Share News

liquor మద్యం తరలిస్తుండగా ఇద్దరి అరెస్ట్‌

ABN , Publish Date - Jan 06 , 2025 | 11:55 PM

liquor liquor పట్టణంలోని ఇందిరా చౌక్‌ వద్ద సోమవారం రాత్రి వాహనాలను తనిఖీ చేస్తుండగా బైక్‌పై 47 క్వార్టర్‌, 15 ఫుల్‌ బాటిళ్ల మద్యాన్ని తరలిస్తుండగా ఇద్దరిని అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ సీఐ పి. సూర్యనారాయణ తెలిపారు.

liquor  మద్యం తరలిస్తుండగా ఇద్దరి అరెస్ట్‌
పలాస: పట్టుబడిన మద్యం బాటిళ్లతో కాశీబుగ్గ పోలీసులు

పలాస, జనవరి 6 (ఆంధ్ర జ్యోతి): పట్టణంలోని ఇందిరా చౌక్‌ వద్ద సోమవారం రాత్రి వాహనాలను తనిఖీ చేస్తుండగా బైక్‌పై 47 క్వార్టర్‌, 15 ఫుల్‌ బాటిళ్ల మద్యాన్ని ఇద్దరి వ్యక్తులు తరలిస్తుండగా వారిని అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ సీఐ పి. సూర్యనారాయణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా.. వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన కర్ని అభిలాష్‌, నందిగాం మండలానికి చెందిన అతని స్నేహితుడు అంబలి ఠాగూర్‌ ద్విచక్రవాహనంపై పలాసలో మద్యం బాటిళ్లు కొనుగోలు చేసి బెల్టు షాపులో విక్రయానికి తరలి స్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందిరాచౌక్‌ వద్ద పోలీసులు సాధారణ తనిఖీలు చేస్తుండగా వీరు అనుమానాస్పదంగా ఉండడంతో పట్టుకుని ప్రశ్నించగా అస లు విషయం బయట పడింది. ఈ మేరకు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసు కుని నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

76 మద్యం బాటిళ్ల స్వాధీనం

ఎచ్చెర్ల, జనవరి 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని కుప్పిలి గ్రామానికి చెందిన లక్ష్మి అక్రమంగా మద్యం విక్రయిస్తుండడంతో ఎచ్చెర్ల పోలీసులు సోమవారం ఆమెను అరెస్ట్‌ చేశారు. రూ.14,500 విలువ చేసే 76 బీరు, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు రిమాండ్‌కు తరలిం చినట్టు ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్‌ చెప్పారు.

Updated Date - Jan 06 , 2025 | 11:55 PM