Share News

Fisherman died పడవ బోల్తా.. మత్స్యకారుడి మృతి

ABN , Publish Date - Jan 16 , 2025 | 11:37 PM

బందరువానిపేట వద్ద గురువారం మ ధ్యాహ్నం సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్య కారుడు కుందు గడ్డెయ్య(41) పడవ బోల్తా పడి మరణించాడు.

Fisherman died  పడవ బోల్తా.. మత్స్యకారుడి మృతి

గార, జనవరి 16(ఆంధ్ర జ్యోతి): బందరువానిపేట వద్ద గురువారం మ ధ్యాహ్నం సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్య కారుడు కుందు గడ్డెయ్య(41) పడవ బోల్తా పడి మరణించాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గడ్డెయ్య, మరో నలుగురితో కలిసి బోటుపై సముద్రంలో చేపల వేటకు వెళ్లాడు. సముద్రంలో కొంతదూరం వెళ్లేసరికి అలల తాకిడికి బోటు బోల్తా పడింది. బోటులో ఉన్న గడ్డెయ్య సముద్రంలో పడి చనిపోయాడు. కాగా గడ్డెయ్యకు భార్య తోటమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. చేపల వేటే జీవనాధారంగా బతు కుతున్న గడ్డెయ్య కుటుంబం దిక్కులేనిదైంది. ప్రభుత్వం తమను ఆదు కోవాలని వారు కోరుతున్నారు. భార్య తోటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ ఎం.చిరంజీవిరావు కేసు నమోదు చేశారు.

విశాఖలో సోంపేట వాసి..

సోంపేట, జనవరి 16(ఆంధ్రజ్యోతి): బుషా భద్ర గ్రామానికి చెందిన మండపాటి రాజుకు మార్‌ (50) విశాఖపట్నంలో మృతి చెందినట్టు సీఐ మంగరాజు తెలిపారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో మృతి చెందినట్టు అక్కడి పోలీసులు సమాచారం అందించారన్నారు. కుటుంబ సభ్యు లకు ఆ సమాచారాన్ని చేరవేశామని, వివరాలు తెలియాల్సి ఉందన్నారు. భార్య రాజ్యలక్ష్మి విశాఖలో ఉండడంతో అక్కడకు వెళ్తున్న క్రమంలో ఆయన మృతి చెంది ఉంటాడని భావిస్తున్నామన్నారు.

రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి..

పాతపట్నం జనవరి 16(ఆంధ్రజ్యోతి): చిన్నలోగిడి గ్రామ సమీపంలో రైలు కిందపడి ఒక వ్యక్తి మృతిచెందిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకొంది. పూరి నుంచి గుణుపూర్‌ వెళ్లే రైలు కింద గురువారం రాత్రి సుమారు7.45 గంటల సమయంలో గుర్తు తెలియనవ్యక్తి పడి మృతి చెందాడు. మృతుని వివరాలు ఇంకా తెలియాల్సిఉంది.

Updated Date - Jan 16 , 2025 | 11:38 PM