ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2025-05-28T23:26:44+05:30 IST
:స్త్రీలు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని పురుషోత్తపురం అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యులు జూహిత పేర్కొన్నారు. బుధ వారం స్థానిక అర్బన్ హెల్త్ సెంటర్‌లో అంతర్జాతీయ మహిళా ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని స్త్రీలకు కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పించారు. గర్భిణులు జాగ్రత్తలు పాటించాలి రక్తహీనత లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, మొదటి, రెండో బిడ్డ మధ్య గల సమయం పాటించడంపై వివరించారు.
ఇచ్ఛాపురం, మే28(ఆం ధ్రజ్యోతి):స్త్రీలు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని పురుషోత్తపురం అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యులు జూహిత పేర్కొన్నారు. బుధ వారం స్థానిక అర్బన్ హెల్త్ సెంటర్‌లో అంతర్జాతీయ మహిళా ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని స్త్రీలకు కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పించారు. గర్భిణులు జాగ్రత్తలు పాటించాలి రక్తహీనత లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, మొదటి, రెండో బిడ్డ మధ్య గల సమయం పాటించడంపై వివరించారు. మహిళలు గర్భదారణ సమయంలో సుగర్, హైపర్ టెన్షన్, క్యాన్సర్ కోసం స్ర్కీనింగ్ నిర్వహించాలని తెలిపారు కార్యక్రమంలో డాక్టర్ అనిత, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.