బర్డ్‌ఫ్లూపై అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Feb 14 , 2025 | 11:46 PM
బర్డ్‌ఫ్లూ నియంత్రణపై రాష్ట్ర సరిహదు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్థకశాఖ జిల్లా సంయుక్త సం చాలకుడు కంచరాన రాజగోపాలరావు ఆదేశించారు.

పాతపట్నం ఫిబ్రవరి14(ఆంధ్రజ్యోతి): బర్డ్‌ఫ్లూ నియంత్రణపై రాష్ట్ర సరిహదు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్థకశాఖ జిల్లా సంయుక్త సం చాలకుడు కంచరాన రాజగోపాలరావు ఆదేశించారు. శుక్రవారం ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో గల పాతపట్నం, వసుంధర చెక్‌పోస్టులను పరిశీలించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ చనిపోయిన కోళ్ల వాహనాలను ప్రవేశించకుండా నిఘా ఉంచాలని సిబ్బందిని సూచించారు. తొలుత పాతపట్నంలోని ప్రాంతీయ పశు వెద్యశాలలో ఏడీ పరిధిలోని పశువైద్యాధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బర్డ్‌ఫ్లూ వ్యాధిపై కోళ్లపెంపక దారులకు పూర్తిస్థాయిలో అవ గాహన కలిగించాలన్నారు. కోళ్లఫారాలను విధిగా సందర్శించి పెంపకదారులకు సూచ నలివ్వాలని ఆదేశించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికైతే జిల్లాలో బర్డ్‌ఫ్లూవ్యాధిలేదని, నియంత్రణకు ముందస్తుచర్యలు తీసుకుంటున్నామ ని తెలిపారు. జిల్లావ్యాప్తంగా సిబ్బందిని అప్రమత్తం చేశామని, జిల్లావ్యాప్తం గా ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేసి ఎటువంటి పరిస్థితినైనా ఎదు ర్కొనేందుకు సిద్ధంచేశామని చెప్పారు.ఆయన వెంట ప్రాంతయ పశువైద్యశాల ఏడీ మంచు కరుణాకరరావు, పశువైద్యాధి కారులు పిఅనిల్, బి.శ్రీవాణి, కె.మౌ నిక, సిబ్బంది ఢిల్లీ, భీమారావు, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.