responsibilities బాధ్యతలపై అవగాహన కల్పించాలి
ABN , Publish Date - Jan 25 , 2025 | 11:53 PM
పారా లీగల్ వలంటీర్లు బాధ్యతలు నిర్వర్తించేలా అవగా హన కల్పించాలని జిల్లా న్యాయాధికారి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు.

గుజరాతీపేట, జనవరి 25(ఆంధ్రజ్యోతి): పారా లీగల్ వలంటీర్లు బాధ్యతలు నిర్వర్తించేలా అవగా హన కల్పించాలని జిల్లా న్యాయాధికారి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. స్థానిక జిల్లా కోర్టు సముదాయంలో పారాలీగల్ వలంటీర్లకు శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజంలో రాజ్యాంగ బద్ధం, చట్టబద్ధంగా ఇవ్వాల్సిన అన్ని హక్కులతోపాటు విధులు సక్రమంగా నిర్వర్తించాలన్నారు. 2024-25 సంవత్సరానికిగాను ఎంపికైన ఈ వలంటీర్లకు న్యాయసేవాధికార సంస్థ అందిస్తున్న సేవలు గూర్చి విపులీకరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు, న్యాయవాది ఎ.భువనేశ్వర్, జి.ఇందిరా ప్రసాద్, పారా లీగల్ వలంటీ ర్లు పాల్గొన్నారు.