Share News

Rathasapthami : రథసప్తమి వేడుకలకు ఏర్పాట్లు

ABN , Publish Date - Jan 31 , 2025 | 11:39 PM

Rathasapthami Festivities మూడు రోజులపాటు రథసప్తమి వేడుకలను వైభ వంగా నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. ఉత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో ఆయన సమావేశమయ్యారు.

Rathasapthami : రథసప్తమి వేడుకలకు ఏర్పాట్లు
మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • తొలిసారిగా హెలీకాఫ్టర్‌ టూరిజం

  • కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • శ్రీకాకుళం కలెక్టరేట్‌, జనవరి 31(ఆంధ్రజ్యోతి): మూడు రోజులపాటు రథసప్తమి వేడుకలను వైభ వంగా నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. ఉత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. శోభాయాత్ర, సాంస్కృతిక, ఆధ్యా త్మిక కార్యక్రమాలతో వైభవంగా ఉత్సవాలను నిర్వహిం చడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ‘2న ఉదయం స్థానిక 80 అడుగుల రోడ్డు వద్ద సామూహిక సూర్యనమస్కారా లతో వేడుకలు ప్రారంభమవుతాయి. మునిసిపల్‌ మైదా నంలో వాలీబాల్‌, కర్రసాము, సంగిడీలు, ఎద్దుల బండ్ల పోటీలు, వెయిట్‌ లిఫ్టింగ్‌ వంటి గ్రామీణ క్రీడల పోటీలు జరుగుతాయి. డచ్‌ బిల్డింగ్‌ వద్ద క్రాకర్స్‌ షో ఉంటుంది. తొలిసారిగా హెలీకాఫ్టర్‌ టూరిజం అందు బాటులోకి తెచ్చాం. దీని నిర్వహణకు సంబంధించి పక డ్బందీగా ఏర్పాట్లు చేయాలి. విద్యుత్తు సరఫరా, పరిశు భ్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి’ అని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో ఆర్డీవో సాయిప్ర త్యూష, డ్వామా పీడీ సుధాకరరావు, ఉప కలెక్టర్‌ లక్ష్మణ రావు, విపత్తు నివారణ అధికారి మోహనరావు, ఏఈ సురేష్‌, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 31 , 2025 | 11:39 PM