నందిగాంలో సంతోషిమాత ఆలయ వార్షికోత్సవం
ABN , Publish Date - Feb 14 , 2025 | 11:52 PM
నందిగాంలో సంతోషిమాత ఆలయ 23వ వార్షికోత్సవం శుక్రవారం నిర్వహించారు.

నందిగాం, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి):నందిగాంలో సంతోషిమాత ఆలయ 23వ వార్షికోత్సవం శుక్రవారం నిర్వహించారు.ఆలయ నిర్వాహకురాలు ఎస్.మహాలక్ష్మి ఆధ్వర్యంలో పురోహితులు రేజేటి బోసుబాబు, రమేష్‌శర్మల పర్యవేక్షణలో 16 వారాలపాటు దీక్షలు చేసిన భక్తులతో ఘటాలను ఊరేగించారు. పూడిచెల్లెమ్మ కోనేరులో ఘటాలు నిమజ్జనం చేశారు.
పంచముఖాంజనేయస్వామి..
పోలాకి, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): రాళ్లపాడు పంచాయతీ జగన్నాఽథస్వామి కాలనీలో గల పంచముఖ అభయాంజనేయస్వామి 12వ వార్సికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పురోహితులు వనమాలి రామచంద్రశర్మ, తేజశర్మలు దంపతులతో పూజలు చేయించారు.ఆలయ కమిటీ సభ్యులు తులసిపాటి కృష్ణంరాజు, తిరుమల, గేదెల లక్ష్మీనారాయణ, జి.అన్నారావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వంశధార డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ ఎవీనాయుడు పాల్గొన్నారు. కాగా కింజరాపువానిపేట ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవం నిర్వహించారు. సుసరాం దుర్గమ్మ జాతర ప్రారంభమయ్యింది.
కొత్తమ్మతల్లి ఆలయంలో పూజలు
కోటబొమ్మాళి, ఫిబ్రవరి14(ఆంధ్రజ్యోతి): స్థానిక కొత్తమ్మతల్లిని నరసన్నపేట జూనియర్ సివిల్‌కోర్టు న్యాయాధికారి హరిప్రియ గురువారం అమ్మవారిని దర్శిం చుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అలయ పూజారి కమ్మకట్టు రాజేష్ ప్రత్యేక పూజలు చేశారు.