Share News

రైలులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

ABN , Publish Date - Feb 16 , 2025 | 12:33 AM

తిరుపతి-పూరీ రైలులో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు పలాస రైల్వే ఎస్‌ఐ షరీఫ్‌ తెలిపారు.

  రైలులో గుర్తు తెలియని వ్యక్తి మృతి
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

పలాస, ఫిబ్రవరి15(ఆంధ్రజ్యోతి): తిరుపతి-పూరీ రైలులో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు పలాస రైల్వే ఎస్‌ఐ షరీఫ్‌ తెలిపారు. విశాఖపట్నం వద్ద రైలు ఎక్కిన 40 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి మద్యం తాగి ఉన్నాడని, పలాస స్టేషన్‌కు వచ్చేసరికి మృతి చెందినట్లు ప్రయాణికులు ఫిర్యాదు చేయ డంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామన్నా రు. ఆయనకు చెందిన వివరాలు ఏవీ లభించలేదని, మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టు మార్టంనకు తరలించామ న్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

వాహనం ఢీకొని వృద్ధుడు..

నందిగాం, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): కొత్తగ్రహారం సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని పలాస మండ లం రేగులపాడుకు చెందిన దాసరి భీమయ్య(75) మృతి చెందాడు. భీమయ్య బోరుభద్ర వెళ్లేందుకు కాలినడకన వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆయనకు భార్య తులసమ్మ, వివాహమైన ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం ఎస్‌ఐ షేక్‌మహ్మద్‌ ఆలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 16 , 2025 | 12:33 AM