Beltshops: ఊరూరా బెల్ట్‌షాపులు
ABN , Publish Date - Jan 16 , 2025 | 12:17 AM
Beltshops: లోని సరుబుజ్జిలి, ఆమదాలవలస మండలాల్లో ఊరూ రా బెల్టు షాపులు వెలిశాయి.

-విచ్చలవిడిగా మద్యం విక్రయాలు
- క్వార్టర్‌పై అదనంగా రూ.50 వసూలు
- చోద్యం చూస్తున్న ఎక్సైజ్ అధికారులు
ఆమదాలవలస, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): ఆమదా లవలస ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ పరిధి లోని సరుబుజ్జిలి, ఆమదాలవలస మండలాల్లో ఊరూ రా బెల్టు షాపులు వెలిశాయి. ఈ బెల్టు షాపులకు మద్యం వ్యాపారులే నేరుగా సరుకు సరఫరా చేస్తున్నా రు. ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో మద్యం సీసాలను రవాణా చేసి బెల్టు దుకాణాలకు చేరవేస్తున్నారు. గ్రామాల్లో అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా ఎవరికి వారే మద్యం అమ్మకాలను కొనసాగిస్తున్నారు. బెల్ట్ నిర్వాహకులు క్వార్టర్ బాటిల్‌పై అదనంగా రూ.50 వసూలు చేస్తూ మందుబాబులను దోచుకుంటున్నారు. ఆమదాలవలస మండలంలో రెండు, పట్టణంలో నాలుగు మద్యం దుకాణాలకు లైసెన్స్‌లు మంజూర య్యాయి. అయితే, వ్యాపారం పెంచుకునేందుకు ఈ దుకాణాల నుంచే వ్యాపారులు బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. బెల్ట్‌షాపుల నిర్వాహకులకు పూర్తిస్థాయిలో అండదండలు అందిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నెలవారి మామూళ్లు అం దుతుండడంతో ఎక్సైజ్ అధికారులు చోద్యం చూస్తున్నా రనే విమర్శలు ఉన్నాయి. వారి కనుసన్నల్లోనే బెల్ట్ షాపుల నిర్వహణ మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతుందని పలువురు ఆగ్రహిస్తున్నారు. బెల్ట్‌షా పుల్లో మద్యం సేవించి మందుబాబులు గ్రామాల్లో తగా దాలకు దిగుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇప్ప టికైనా ఎక్సైజ్, పోలీస్ అధికారులు స్పందించి బెల్టు షా పులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
14 మద్యం సీసాలు స్వాధీనం
సోంపేట, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): మండలంలో బెల్టుషాపు లపై దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ లవరాజు తెలిపారు. జింకిభద్రలో బెల్టుషాపు నిర్వహకుడి నుంచి 6, రుషికుద్దలో బెల్టుషాపు నిర్వహ కుడి నుంచి 8 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.