Share News

నేటి అర్ధరాత్రి నుంచి ఆదిత్యునికి క్షీరాభిషేకం

ABN , Publish Date - Feb 03 , 2025 | 12:13 AM

అరసవల్లిలో సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి సూర్య నారాయణస్వామికి క్షీరాభిషేకం నిర్వహిస్తారు.

నేటి అర్ధరాత్రి నుంచి ఆదిత్యునికి క్షీరాభిషేకం
స్వామిని దర్శించుకునేందుకు క్యూలో ఉన్న భక్తులు

అరసవల్లి/ శ్రీకాకుళం అర్బన్‌, ఫిబ్రవరి 2: అరసవల్లిలో సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి సూర్య నారాయణస్వామికి క్షీరాభిషేకం నిర్వహిస్తారు. ప్రత్యేక పూజలు అనంతరం మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వామి నిజరూప దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. అనంతరం స్వామిని పూలతో ప్రత్యేకంగా అలంకరించి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనమిస్తా రు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు కూడా తరలివచ్చి స్వామిని దర్శించుకోనున్నారు. సుమారు 1.20 లక్షల మంది భక్తులు రథసప్తమి ఉత్సవాలకు తరలిరా నున్నట్టు అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు 2,300 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీ పురం మన్యం జిల్లాల అధికారులు కూడా ఉత్సవ కార్యక్రమాల విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర పండుగను తొలిసారిగా ప్రకటించినందున అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఉత్సవా లను నిర్వహించేందుకు.. జిల్లాలోని కేంద్ర,రాష్ట్ర మంత్రు లు, శ్రీకాకుళం ఎమ్మెల్యే నిరంతరం ఏర్పాట్లను పర్యవే క్షిస్తున్నారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి.. అధికారులను సమ న్వయ పరిచి వేడుకల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పా ట్లు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి కొనసాగు తుండడంతో వీఐపీ, వీవీఐపీ, వీవీపీల దర్శనాలను రద్దు చేశారు. ఉచిత క్యూలైన్లలో వచ్చే సాధారణ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా, నిరం తర దర్శ నం కలిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈవో వై.భద్రాజీ ఆధ్వర్యంలో ఆలయం రాజగోపురాన్ని విద్యుద్దీపాలంకర ణతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అలాగే భక్తుల సౌక ర్యార్థం తోట జంక్షన్‌ నుంచి సింహద్వారం, అమ్మ వారి గుడి, ఇంద్ర పుష్కరిణి ప్రాంతాల్లో మొత్తం 40 పాయిం ట్లలో 150 మొబైల్‌ మరుగుదొడ్లను మున్సిపల్‌ అధికా రులు ఏర్పాటు చేస్తున్నారు. క్యూలైన్లలో భక్తుల కోసం 30 పాయింట్లలో 80వేల వాటర్‌ బాటిళ్లను సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా మూడురోజుల పండగ నేప థ్యంలో ఆదివారం వందలాది మంది భక్తులు తరలి వచ్చి స్వామిని దర్శిం చుకున్నారు. దీంతో అరసవల్లి ప్రాంగణం కళకళ లాడింది.
నేటి కార్యక్రమాలు ఇవీ..
రథసప్తమి వేడుకల్లో భాగంగా రెండో రోజు సోమవారం ఉదయం 9 గంటలకు డచ్‌ బిల్డింగ్‌ వద్ద హెలికాప్టర్‌ విహారం కొనసాగనుంది. ఎన్టీఆర్‌ ముని సిపల్‌ హైస్కూల్‌ మైదానంలో రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలు నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటల నుంచి స్థానిక ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో సుందరంపల్లి శ్రీని వాస్‌ శాక్సాఫోన్‌, 5.30 నుంచి 6.15 వరకు సీతంపేట ఐటీడీఏ జానపదం, బుర్రకథ ప్రదర్శిస్తారు. 6.15 నుంచి 6.45 వరకు శాస్త్రీయ సంగీతం, 6.45 నుంచి 7 వరకు నీరజా సుబ్రహ్మణ్యం బృందంచే శాస్త్రీయ నృత్యం, 7-00 నుండి 7-30 వరకు రఘుపాత్రుని శ్రీకాంత్‌ బృందంచే శాస్త్రీయ నృత్య కార్యక్రమం ఉం టుంది. 7.30 నుంచి 8 గంటల వరకు సంప్రదాయ కూచిపూడి గురుకులం వారిచే యోగానృత్యం, 8 గంటలకు లేజర్‌ షో, 8.15 నుంచి మంగ్లీ టీమ్‌ మూవీ ఆర్కెస్ట్రా నిర్వహిస్తారు.

Updated Date - Feb 03 , 2025 | 12:13 AM