Share News

పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు: ఎమ్మెల్యే

ABN , Publish Date - Feb 12 , 2025 | 11:42 PM

: పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి హెచ్చరించారు. బుధవారం స్థానిక ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో ప్రహరీ గోడ పనులు పరిశీలించారు.

పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు: ఎమ్మెల్యే
జలుమూరు: పంచముఖ అభయాంజనేయ స్వామికి పూజలు చేస్తున్న రమణమూర్తి:

నరసన్నపేట, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి హెచ్చరించారు. బుధవారం స్థానిక ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో ప్రహరీ గోడ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనులు అంచనాలు ప్రాప్తికి మెటీరియల్‌ వినియోగించి నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నాణ్యతలో అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఆసుపత్రి ఏవో రమణమూర్తి, టీడీపీ నాయకులు గొద్దు చిట్టిబాబు, బైరి భాస్కరరావు ఉన్నారు.

ఫజలుమూరు (సారవకోట)ఫిబ్రవరి 12, (ఆంధ్రజ్యోతి): :ప్రతిఒక్కరూ ఆధ్యాత్మి కతను అలవరచుకోవాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. సారవకోట మండలంలోని సవరడ్డపనసలోని పంచముఖ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం పురస్కరించుకుని నిర్వహించినపూజల్లో పాల్గొనిస్వామిని దర్శించుకున్నారు. ఆయన వెంట టీడీపీ మండలాధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ, నాయకులు తేజకుమార్‌, ఉమామహేశ్వరరావు, తిరుపతిరావు, పి.నందకిశోర్‌ ఉన్నారు.

Updated Date - Feb 12 , 2025 | 11:42 PM