Share News

వెయిట్‌ లిఫ్టింగ్‌లో సత్తాచాటిన వర్సిటీ విద్యార్థిని

ABN , Publish Date - Feb 24 , 2025 | 11:49 PM

: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ తరఫున ధర్మశాలలో సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన అఖిల భారత మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో పాల్గొన్న గుజ్జల వర్షిత సత్తాచాటింది.

వెయిట్‌ లిఫ్టింగ్‌లో సత్తాచాటిన వర్సిటీ విద్యార్థిని
వర్షితను అభినందిస్తున్న వీసీ ప్రొఫెసర్‌ కేఆర్‌ రజని:

ఎచ్చెర్ల, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ తరఫున ధర్మశాలలో సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన అఖిల భారత మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో పాల్గొన్న గుజ్జల వర్షిత సత్తాచాటింది.శ్రీకాకుళంలో డిగ్రీ చదువుతున్న వర్షిత ఈనెల 14 నుంచి నాలుగురోజుల పాటు జరిగిన పోటీల్లో పాల్గొని 64 కిలోల కేటగిరీలో రజత పతకం సాధించింది. ఈమేరకు వీసీ ప్రొఫెసర్‌ కేఆర్‌ రజని, వర్సిటీ రెక్టార్‌ ప్రొఫెసర్‌ బి.అడ్డయ్య, ఎస్‌వో డాక్టర్‌ కె.సామ్రాజ్యలక్ష్మి, స్పోర్ట్స్‌ డీన్‌ డాక్టర్‌ పి.రవికుమార్‌, పీడీ డాక్టర్‌ ఎం.శ్రీనివాసరావు అభినందించారు.

కరాటేలో ఆమదాలవలస విద్యార్థులు..

ఆమదాలవలస, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని రెండోవార్డు ఊసవాని పేటకు చెందిన విద్యార్థులు పి.నికేష్‌నాయుడు, బి.హేసాయి జాతీయ స్థాయిలో నిర్వ హించిన కరాటే పోటీల్లో సత్తాచాటారు. ఈనెల 23న హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన జాతీయస్థాయి మార్షల్‌ ఆర్ట్స్‌ వెపన్‌ పోటల్లో జిల్లా నుంచి పలువురు విద్యారులు పాల్గొన్నారు.ఈమేరకు పట్టణంలో చదువుతున్న పి.నికే ష్‌నాయుడు బంగారు, బి.హేమసాయి కాంస్యపతకం సాధించారు. నికేష్‌నాయుడును కోచ్‌ నక్క లక్ష్మణనాయుడుతోపాటు పలువురు అభినందించారు.

Updated Date - Feb 24 , 2025 | 11:49 PM