Share News

eunion of alumni పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

ABN , Publish Date - Jan 17 , 2025 | 11:32 PM

eunion of alumni వివిధ పాఠశా లల్లో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు శుక్రవారం ఆత్మీయ కలయిక కార్యక్రమాలను నిర్వహించారు.

eunion of alumni   పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక
పాతపట్నం: ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు బొకే ఇస్తున్న క్లాస్‌మేట్స్‌

వజ్రపుకొత్తూరు/టెక్కలి/కోటబొమ్మాళి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): వివిధ పాఠశా లల్లో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు శుక్రవారం ఆత్మీయ కలయిక కార్యక్రమాలను నిర్వహించారు. వజ్రపు కొత్తూరు మండలం నగరపంల్లి హైస్కూల్‌ లో 1989-90, కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో 2010-11లో పదో తరగతి చదువుకున్న విద్యార్థుల సమ్మేళనం నిర్వహిం చారు. అలాగే టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2013-16 విద్యా సంవత్సరాల మధ్య సీబీ జెడ్‌, బయోకెమిస్ట్రీ, బీహెచ్‌సీ పూర్తి చేసిన విద్యార్థులు కూడా కలుసుకుని నాటి మధురస్మృతులను మననం చేసుకున్నారు. నాటి ఉపాధ్యాయులు, అధ్యాపకులను సత్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆర్థి కంగా ఇబ్బందుల్లో ఉన్న సహచరు లను ఆదుకునేందుకు నిర్ణయించుకున్నారు. హరిశ్చంద్రపురంలో నాటి ఉపా ధ్యాయు లు సి.చిరంజీవునాయుడు, చింతాడ సత్యనారాయణ, తమ్మినేని లక్ష్మణ రావు, కృష్ణా రావు, అర్జునరావులను సత్కరించారు. కార్యక్రమాల్లో కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు బి.శశిభూషన్‌, నువ్వలరేవు మాజీ సర్పంచ్‌లు కె.కేశవ రావు, ధర్మారావు, దాలి బందు, మాధవరావు, మోహనరావు, నగరంపల్లి హైస్కూల్‌ హెచ్‌ఎం డి.కేశవరావు, టెక్కలి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ గోవిందమ్మ, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఆత్మీయుల అభిమానంతో ఆనందం: ఎంజీఆర్‌

పాతపట్నం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ఆత్మీయుల అభిమానం వల్ల ఆనందంతో కూడిన జీవనం సాగుతుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. పెద్దసీది జడ్పీ ఉన్నతపాఠశాలలో 1988-89 సంవత్సరంలో 10వ తరగతి చది విన విద్యార్థుల ఆత్మీయ కలయిక శుక్రవారం నిర్వహించారు. తన క్లాస్‌ మేట్స్‌ను కలవడం ఆనందంగా ఉందన్నారు. దీనిని జీవితకాలం మరువలేన న్నారు. నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆయనకు బొకే ఇచ్చి శాలువ కప్పి సహచర విద్యార్థులు సత్కరించారు. నాటి ఉపాధ్యాయులను సత్కరించి వారి ఆశీర్వాదాలు స్వీకరించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిం చారు. కార్యక్ర మంలో పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2025 | 11:32 PM