Pramadam త్రుటిలో తప్పిన ప్రమాదం
ABN , Publish Date - Feb 16 , 2025 | 11:40 PM
Pramadam మండల పరిధి జర్జంగి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పిం ది.
కోటబొమ్మాళి, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): మండల పరిధి జర్జంగి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పిం ది. టెక్కలి నుంచి విశాఖపట్నం వెళుతున్న కారు అదుపుతప్పి డివై డర్ ఎక్కి ఊగిసిలాడుతున్న సమయంలో అదే మార్గంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ వేగాన్ని అదుపు చేసే సమయంలో కారుని స్వ ల్పంగా ఢీకొంది. అయితే ఈ ఘటనలో కారుకు కొంత నష్టం వాటిల్లినా అందులోని వారికి ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కారులో వెళు తున్నవారు టెక్కలిలో ఓ వివాహానికి హాజరై తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపారు.
ఆటో బోల్తా పడి ఆరుగురికి గాయాలు
నరసన్నపేట, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): దేవాది గ్రామ సమీపంలో జాతీ య రహదారిపై ఓ పెట్రోల్ బంకు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం లో ఆరుగురికి గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. ఎచ్చెర్ల మండలం సనపలవానిపేటకు చెందిన గ్రామస్థులు ఆటోలో నిమ్మాడ వెళు తుండగా దేవాది వద్దకు వచ్చేసరికి అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న ఆర్.ఈశ్వరమ్మ, కొండాలమ్మ, పైడమ్మలకు బలమైన గాయాలు కాగా మరో ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను హైవే అంబులెన్స్‌లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. హైవే పెట్రోలింగ్ పోలీసులు వెంటనే స్పందించి తగిన సాయం అందించారు.
గృహహింసపై కేసు నమోదు
సంతబొమ్మాళి, ఫిబ్రవరి 16(ఆంధ్రజోతి): నౌపడ పంచాయతీ కూర్మ నాథపురం గ్రామా నికి చెందిన పరపటి సుమలత ఫిర్యాదు మేరకు గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేసినట్లు నౌపడ ఎస్‌ఐ నారాయణస్వామి ఆదివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఇంటిలో తన భర్త విద్యాసాగర్ బెల్టుతో రక్తం వచ్చేటట్టు కొట్టి గాయపరిచారని బాధి తురాలు జనవరి 15న ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై ఫోరెన్సిక్ నివేదిక శని వారం అందిందని, ఈ మేరకు విద్యాసాగర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.