Depothavam : ఆకట్టుకున్న దీపోత్సవం
ABN , Publish Date - Feb 09 , 2025 | 11:46 PM
Festivities జి.సిగడాం మండలం నిద్దాంలో నిద్దాలమ్మ యాత్ర మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన లక్ష దీపోత్సవం భక్తులను ఆకట్టుకుంది.

జి.సిగడాం, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): జి.సిగడాం మండలం నిద్దాంలో నిద్దాలమ్మ యాత్ర మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన లక్ష దీపోత్సవం భక్తులను ఆకట్టుకుంది. గ్రామ పురవీధుల్లోనూ దీపాలను వెలిగించడంతో నిద్దాం.. కాంతివంతమైంది. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సతీమణి ప్రభానాయుడు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దీపోత్సవాన్ని ప్రారంభించారు. వందలాది మంది భక్తులు పాల్గొని దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.