Share News

LIqUOR:7,400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

ABN , Publish Date - Jan 12 , 2025 | 12:01 AM

LIqUOR:ఆంధ్రా-ఒడిశాసరిహద్దు ప్రాంతం లో బెల్లంఊట, సారా తయారీపై ఇరురాష్ట్రాల అధికారులు శనివారం ఉమ్మడిగా దాడులు నిర్వహించారు. పాతపట్నం ఎక్సైజ్‌శాఖ సీఐ కోట కృష్ణారావు కథనం మేరకు..ప్రొహిబిషన్‌ ఎండ్‌ ఎక్సైజ్‌ శ్రీకాకుళం డిప్యూటీ కమిషనర్‌ ఎస్‌వీవీఎన్‌ బాబ్జీరావు, ఒడిశాలోని గంజాం జిల్లా డిప్యూటీ కమిషనర్‌ బిభూతి భూషణల సంయుక్త సారధ్యంలో ఆంధ్రా-ఒడిశా సరి హద్దు ప్రాంతంలో దాడులు నిర్వహించారు.

LIqUOR:7,400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
ఏపీ-ఒడిశా ఎక్సైజ్‌ సిబ్బంది దాడుల్లో పట్టుబడిన సారా:

పాతపట్నం, జనవరి11(ఆంధ్రజ్యోతి):ఆంధ్రా-ఒడిశాసరిహద్దు ప్రాంతం లో బెల్లంఊట, సారా తయారీపై ఇరురాష్ట్రాల అధికారులు శనివారం ఉమ్మడిగా దాడులు నిర్వహించారు. పాతపట్నం ఎక్సైజ్‌శాఖ సీఐ కోట కృష్ణారావు కథనం మేరకు..ప్రొహిబిషన్‌ ఎండ్‌ ఎక్సైజ్‌ శ్రీకాకుళం డిప్యూటీ కమిషనర్‌ ఎస్‌వీవీఎన్‌ బాబ్జీరావు, ఒడిశాలోని గంజాం జిల్లా డిప్యూటీ కమిషనర్‌ బిభూతి భూషణల సంయుక్త సారధ్యంలో ఆంధ్రా-ఒడిశా సరి హద్దు ప్రాంతంలో దాడులు నిర్వహించారు.ఒడిశాలోని సింగుపూర్‌, శిరడా, గురిసింగిగూడ తమిలిగూడ, నేరేడగూడతోపాటు పలు మారుమూల గ్రా మాల్లో ఇరురాష్ట్రాల ప్రొహిబిషన్‌, ఒడిశా పోలీస్‌ శాఖ సిబ్బంది తనిఖీచే శారు. దాడుల్లో 7400 లీటర్ల పులిసిన బెల్లం ఊటను ధ్వంసంచేశారు. 1140 లీటరు సారాను స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌శాఖ డీపీఈవోతిరుపతినాయుడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏఈ ఎస్‌డీవీ జీరాజు ఒడిశా డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ ఎక్సైజ్‌ బిభూతి భూషణ పర్యవేక్షణలో జరిగిన దాడుల్లో శ్రీకాకుళం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ఈఎస్‌ టాస్క్‌ఫోర్స్‌, శ్రీకాకుళం, పలాస, పాతపట్నం, కొత్తూరు, ఆమదాలవలస, నరసన్నపేట ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్లు, గజపతి జిల్లా ఎక్సైజ్‌, పోలీస్‌శాఖ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 12:02 AM