PM Tour ప్రధాని సభకు 65 బస్సులు: బగ్గు
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:06 AM
PM Tour ప్రధాన మంత్రి నరేంద్రమోదీ విశాఖ రానున్న నేపథ్యంలో నియోజకవర్గం నుంచి 65 బస్సులను కేటాయించామని, కూటమి నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొనాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు.

నరసన్నపేట, జనవరి 6(ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి నరేంద్రమోదీ విశాఖ రానున్న నేపథ్యంలో నియోజకవర్గం నుంచి 65 బస్సులను కేటాయించామని, కూటమి నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొనాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు. ఈ మేరకు సోమ వారం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు. ప్రతి పంచాయతీ నుంచి యువకులు, మహిళలను తీసుకురావాల్సిన బాధ్యత కూటమి నాయకులపై ఉందన్నారు. కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.
ప్రధాని పర్యటనను విజయవంతం చేయండి: శిరీష
పలాస/హరిపురం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): దేశ ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నంలో పర్యటి స్తున్నందున ఈ పర్యటనను కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. సోమవారం పలాస, హిమగిరి టీడీపీ కార్యాలయాల్లో కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, నాయకులు తప్పనిసరిగా హాజరు కావాలని పిలుపు నిచ్చారు. కార్య క్రమంలో కూటమి నాయకులు వజ్జ బాబూరావు, భావన దుర్యోధన, బడ్డ నాగరాజు, దువ్వాడ శ్రీకాంత్, గాలి కృష్ణారావు, అంబటి కృష్ణమూర్తి, దడియాల నర్సింహులు, దాసరి తాతా రావు, రట్టి లింగరాజు, లబ్బ రుద్రయ్య, పలువురు నేతలు పాల్గొన్నారు.