Share News

31 కిలోల గంజాయి స్వాధీనం

ABN , Publish Date - Feb 24 , 2025 | 12:08 AM

ఒడిశా నుంచి ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌ మీదుగా గంజాయి మూటలతో గుజరాత్‌కు తరలిస్తున్న ఇద్దర్ని అరె స్ట్‌ చేసి వారి వద్ద నుంచి 31.110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు సీఐ మీసాల చిన్నమనాయుడు తెలిపారు.

31 కిలోల గంజాయి స్వాధీనం
పట్టుబడిన నిందితులతో సీఐ చిన్నమనాయుడు

ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌ మీదుగా గంజాయి మూటలతో గుజరాత్‌కు తరలిస్తున్న ఇద్దర్ని అరె స్ట్‌ చేసి వారి వద్ద నుంచి 31.110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు సీఐ మీసాల చిన్నమనాయుడు తెలిపారు. ఆదివారం ఆయన ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఉపేంద్ర స్వైన్‌ చెడు వెసనాలు అలవాటు పడి గంజాయి రవాణా చేస్తుంటా డు. ఈ క్రమంలో శనివారం ఒడిశా రాష్ట్రం కోడల గ్రామంలో దీపక్‌ వద్ద గంజాయి తీసుకుని గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లో దీపక్‌ సూచించిన వ్యక్తికి అందజేసేం దుకు మరో వ్యక్తితో ఉపేంద్ర ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అను మానితులుగా తిరుగుతుండడంతో వీరి వద్ద ఉన్న బ్యాగులు తనిఖీ చేయగా గంజాయి ఉన్నట్టు గుర్తించారు. దీంతో వారిద్దరిని అరెస్ట్‌ చేసి మెజిస్ట్రేట్‌ ఎదు ట హాజరు పరిచారు. కార్యక్రమంలో పట్టణ ఎస్‌ఐ ముకుందరావు, హెచ్‌సీ తెలుకుల రామారావు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 24 , 2025 | 12:08 AM