Share News

Lok Adalat: జాతీయ లోక్‌అదాలత్‌లో 2,212 కేసులు రాజీ

ABN , Publish Date - Mar 08 , 2025 | 11:39 PM

National Lok Adalat జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 2,212 కేసులు రాజీ అయ్యాయి. ఇందులో 127 సివిల్‌ కేసులు, 2,074 క్రిమినల్‌, 11 ప్రీ లిటిగేషన్‌ కేసులు రాజీ అయ్యాయని జిల్లా న్యాయాధికారి జునైద్‌ అహ్మద్‌ మౌలానా తెలిపారు.

Lok Adalat: జాతీయ లోక్‌అదాలత్‌లో 2,212 కేసులు రాజీ
కక్షిదారులకు పరిహారం చెక్కును అందజేస్తున్న జిల్లా న్యాయాధికారి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

  • జిల్లా న్యాయాధికారి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

  • గుజరాతీపేట, మార్చి 8(ఆంధ్రజ్యోతి): జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 2,212 కేసులు రాజీ అయ్యాయి. ఇందులో 127 సివిల్‌ కేసులు, 2,074 క్రిమినల్‌, 11 ప్రీ లిటిగేషన్‌ కేసులు రాజీ అయ్యాయని జిల్లా న్యాయాధికారి జునైద్‌ అహ్మద్‌ మౌలానా తెలిపారు. కక్షిదారులకు పరిహారం చెక్కులు అందజేశామన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహిం చిన జాతీయ లోక్‌అదాలత్‌లో నాలుగో అదనపు జిల్లా న్యాయాధికారి వై.యుగంధర్‌, అదనపు సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి జమ్రత్‌ బేగం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు, న్యాయాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2025 | 11:39 PM