physical endurance tests:: శారీరక దారుఢ్య పరీక్షల్లో 220 మంది అర్హత
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:11 AM
physical endurance tests:: పోలీసు కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో భాగంగా ఎచ్చెర్లలోని సాయుధ పోలీసు మైదానంలో ఆరో రోజు సోమవారం శారీరక దారుఢ్య పరీక్షలు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పర్యవేక్షణలో జరిగాయి.

ఎచ్చెర్ల, జనవరి 6(ఆంధ్రజ్యోతి):పోలీసు కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో భాగంగా ఎచ్చెర్లలోని సాయుధ పోలీసు మైదానంలో ఆరో రోజు సోమవారం శారీరక దారుఢ్య పరీక్షలు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పర్యవేక్షణలో జరిగాయి. 631 మంది ఈ పరీక్షలకు హాజరుకావల్సిఉండగా, 364 మంది హాజరయ్యారు. ఈ మేరకు 220 మంది అర్హత సాధించారు. మంగళవారం కూడా శారీరక దారుఢ్య పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయి.