liquor bottles 1752 మద్యం సీసాల స్వాధీనం
ABN , Publish Date - Feb 14 , 2025 | 12:12 AM
అక్రమంగా తరలిస్తున్న రూ1,95,360 విలువ చేసే 1752 మద్యం సీసాలు రూరల్ పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు.

వీటి విలువ రూ1.95 లక్షలు
ఇద్దరు అరెస్టు.. రిమాండ్‌కు తరలింపు
ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): అక్రమంగా తరలిస్తున్న రూ1,95,360 విలువ చేసే 1752 మద్యం సీసాలు రూరల్ పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. రూరల్ ఎస్‌ఐ శ్రీనివాసరావు గురువారం తెలిపిన వివరాల మేరకు.. బుధవారం రాత్రి తిప్పనపుట్టుగ జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో ఓ వ్యాన్‌లో 1632 (180ఎంఎల్) మద్యం సీసాలు, 120 (750ఎంఎల్) బీర్ సీసాలు అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు. కొఠారి గ్రామం వద్ద గల ఓ వైన్‌షాపులో కపాసకుద్ది గ్రామానికి చెందిన బాబూరావు అనే వ్యక్తి మద్యాన్ని కొనుగోలు చేశాడు. ఈ మద్యాన్ని గరడాల కాళిదాస్, తన కుమారుడు గరడాల నాని వాహనంలో తరలిస్తుండగా పట్టుబడ్డారు. మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం తోపాటు వారిద్దరితోపాటు మద్యం కొనుగోలు చేసిన బాబూరావును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. భారీగా మద్యం విక్రయించిన ఆ వైన్‌షాపులోని వ్యక్తులపై కేసు నమోదు చేస్తామని, అలాగే ఆ షాపు లైసెన్స్ రద్దు చేస్తామని ఎస్‌ఐ తెలిపారు.