16.2 కిలోల గంజాయి స్వాధీనం
ABN , Publish Date - Jan 25 , 2025 | 12:09 AM
ఒడిశా నుంచి గుజరాత్ రాష్ట్రా నికి తరలిస్తున్న 16.2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు ఇచ్ఛాపురం సీఐ చిన్నంనాయిడు తెలిపారు.

ఇచ్ఛాపురం, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి గుజరాత్ రాష్ట్రా నికి తరలిస్తున్న 16.2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు ఇచ్ఛాపురం సీఐ చిన్నంనాయిడు తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో శుక్రవారం రాత్రి ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా కాంచన గ్రామానికి చెందిన సురేష్ చంద్రగౌడ, రాకేష్ పొకిలీలు గుజరాత్ రాష్ట్రం డైమాండ్ నగర్‌కు ఒడిశా నుంచి 16.2 కిలోల గంజాయితో వస్తూ.. కవిటి మండలం కొజ్జీరియా జంక్షన్ వద్ద జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. ఈ క్రమంలో కవిటి ఎస్‌ఐ రవివర్మ, తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేస్తుండగా వారు పట్టుబ డ్డారు. వీరినుంచి గంజాయితోపాటు రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసినట్టు తెలిపారు.