speed skating స్పీడ్ స్కేటింగ్‌లో క్రీడాకారులకు 13 పతకాలు
ABN , Publish Date - Feb 03 , 2025 | 11:57 PM
జాతీయ స్ధాయి స్పీడ్ స్కేటింగ్ పోటీల్లో పలాస క్రీడా కారులు పలు విభాగాల్లో 13 పత కాలు సాధించినట్లు కోచ్ బి. చంద్రావతి తెలిపారు.

కాశీబుగ్గ, ఫిబ్రవరి 3 (ఆంధ్ర జ్యోతి): జాతీయ స్ధాయి స్పీడ్ స్కేటింగ్ పోటీల్లో పలాస క్రీడా కారులు పలు విభాగాల్లో 13 పత కాలు సాధించినట్లు కోచ్ బి. చంద్రావతి తెలిపారు. తమిళనాడు రాష్ట్రం మధురైలో గత మూడు రోజులుగా జరిగిన జాతీయస్థాయి స్పీడ్ స్కేటింగ్ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరచగా నిర్వాహకులు పత కాలు అందించి అభినందించారు. పతకాలు సాధించిన వారిలో తోసిని రాయ్, ఆయాన్, అన్విత, అంశక, రవి, పార్థసాయి, సుభాష్, ధనేష్, విష్ణు, సుమంత్, కౌశిక్, విజయ్ ఉన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను చంద్రావతితో పాటు రోలర్ స్కేటింగ్ క్లబ్ కోచ్ గోపిచంద్ అభినందించారు.
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో క్రీడాకారుల ప్రతిభ
టెక్కలి, ఫిబ్రవరి 3(ఆంధ్ర జ్యోతి): కాకినాడ జేఎన్‌టీయూలో జనవరి 31, ఫిబ్రవరి 1, 2 తేదీల్లో జరిగిన ఎన్టీఆర్ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో జిల్లా తరఫున పాల్గొన్న టెక్కలి క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. ఈ సంద ర్భంగా ఎనిమిది స్వర్ణాలు, ఆరు వెండి, ఏడు రజత పతకాలు సాధించారని కోచ్ నర్సిపురం శేఖర్ తెలిపారు. ఉత్తమ ఫైటర్‌గా తాస్సవి కృష్ణా సామీ, మెండ తపస్వీలకు ట్రోఫీ, స్పోర్ట్స్ కిట్ ఇచ్చి సత్క రించడంతో పాటు శ్రీకాకుళం జిల్లాకు ఓవరాల్ చాంపి యన్‌షిప్ మూడో స్థానం లభించగా ట్రోఫీ తో పాటు నగదు పురస్కారం అందించారు. ఈ సందర్భంగా కోచ్ పాండవుల జగదీష్‌కు, రిఫరీ జస్వంత్‌కు, టీం మేనేజర్ పడాల అక్షా, ఆరంగి సాగర్‌లను ఆయన అభినందించారు.