marijuana 10.25 కిలోల గంజాయి స్వాధీనం
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:11 AM
ఒడిశా రాష్ట్ర గంజాం జిల్లా లాఠీ గ్రామానికి చెందిన సురేష్ నాయక్ 10.25 కిలోల గంజాయితో పో లీసులకు గురువారం పట్టుబడ్డాడు.

కవిటి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): ఒడిశా రాష్ట్ర గంజాం జిల్లా లాఠీ గ్రామానికి చెందిన సురేష్ నాయక్ 10.25 కిలోల గంజాయితో పో లీసులకు గురువారం పట్టుబడ్డాడు. డీఎస్పీ వెంకటప్పారావు తెలిపిన వివరాల మేరకు.. సరేష్ తన ఆర్థిక పరిస్థితిని స్నేహితుడైన గంజాయి వ్యాపారి రాజేంద్ర బాడిత్యతో చెప్పాడు. దీంతో గంజాయిని బెంగు ళూరు తీసుకుని వెళ్లి తాను చెప్పిన వ్యక్తికి అప్పగిస్తే కిలోకి రూ.1000 ఇస్తానని చెప్పాడు. ఇందుకు అంగీకరించిన సురేష్ గతే డాది ఆగస్టులో రాజేంద్ర భాడిత్య చెప్పినఉ్టగా గంజాయి తీసుకుని వెళ్లి బెంగుళూరులో ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి రాజేంద్ర చెప్పిన చోటికి గంజాయిని చేరవేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో గురువారం ఒడిశా రాష్ట్రం బరంపురంలో కొనుగోలు చేసిన 10.25 కిలోల గంజాయిని తీసుకొని బస్సులో కొజ్జిరియా టోల్‌గేట్ ముందు గల ఓవర్ బ్రిడ్జి వద్ద బస్సు దిగాడు. అక్కడ నుంచి కంచిలి రైల్వేస్టేషన్‌కు వెళ్లేందుకు కొజ్జిరియా జంక్షన్ వద్ద బస్సు ఎక్కు తుండగా పోలీసులు పట్టుకుని విచారించి పై వివరాలు రాబట్టా రు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్యక్ర మంలో సీఐ ఎం.చిన్నమనాయుడు, ఎస్‌ఐ రవివర్మ పాల్గొన్నారు.
ఒడిశా టు ఎన్టీఆర్ జిల్లా
ఇచ్ఛాపురం, మార్చి 6(ఆంధ్రజ్యోతి): ఒడిశా రాష్ట్రం బరంపురం నుంచి ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టణ పోలీసులు పట్టుకున్నారు. స్థానిక సర్కిల్ కార్యా లయంలో ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వెంకటప్పా రావు గురువారం తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహిపట్నానికి చెందిన ముగ్గురు యువకులు కంబాల సూర్య, కలపాత తేజ, వంశీ గంజాయికి బానిసగా మారారు. ఈ క్రమంలో ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి ఇచ్ఛాపురం నుంచి రైలులో వెళ్లేందుకు ప్రయత్నిం చారు. వీరిపై అనుమానం రావడంతో పోలీసులు తనిఖీ చేయగా సుమారు 1.5 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీఐ మీసాల చిన్నమనాయుడు, పట్టణ ఎస్‌ఐ ముకుందరావు పాల్గొన్నారు.