the melee ఖాజీపేట కొట్లాట కేసులో 10 మంది అరెస్టు
ABN , Publish Date - Feb 03 , 2025 | 11:59 PM
the melee మండలంలోని కింతలి పంచా యతీ ఖాజీపేటలో ఆదివారం జరిగిన కొట్లాట, దాడి సంఘటనలో ఇరు వర్గాల ఫిర్యాదుమేరకు పది మందిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ వి.సత్యనారా యణ తెలిపారు.

పొందూరు, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): మండలంలోని కింతలి పంచా యతీ ఖాజీపేటలో ఆదివారం జరిగిన కొట్లాట, దాడి సంఘటనలో ఇరు వర్గాల ఫిర్యాదుమేరకు పది మందిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ వి.సత్యనారా యణ తెలిపారు. ఇరువర్గాలు దాడులు చేసుకోవడంతో హత్యాయత్నం కేసును నమోదుచేసిన విషయం విదితమే. సోమవారం ఖాజీపేటలో దాడిపై ఎస్‌ఐ సత్యనారాయణ దర్యాప్తు నిర్వహించారు. ఒకవర్గానికి చెందిన ఇద్దరి తోపాటు మరో వర్గానికి చెందిన ఎనిమిది మందిని సోమవారం అరెస్టు చేశారు. బాధితురాలు రోజా ఇల్లు, దాడిలో ధ్వంసమైన ఆటోను పరిశీలించారు.
కనిమెట్టలో చోరీ
పొందూరు, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కనిమెట్టలో గ్రామా నికి చెందిన పి.వెంకట సత్యవతి ఇంట్లో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం చోరీకి పాల్పడ్డారు. పోలీసుల సమాచారం మేరకు.. ఇంటికి తాళాలు వేసి ఆదివారం ఉదయం పనులకు బయటకు వెళ్లారు. ఇంటికి తిరిగివచ్చి చూసేసరికి దుస్తులు చిందర వందరగా పడి ఉన్నాయి. ఇంటిలో స్లేడ్‌పై పెట్టెలో ఉంచిన రూ.75 వేలు నగదు, తులంపావు బంగా రం చోరీకి గురైనట్లు గుర్తించి ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఎస్‌ఐ సిబ్బందితో ఇంటిని పరిశీలిం చారు. చోరీపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.