Share News

Mahakumbh Mela 2025: మహాకుంభమేళా.. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Jan 02 , 2025 | 07:14 PM

మరికొద్ది రోజుల్లో ప్రయాగ్ రాజ్‌లో మహాకుంభమేళ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.

Mahakumbh Mela 2025: మహాకుంభమేళా.. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్/ అమరావతి, జనవరి 02: ప్రయాగరాజ్ వేదికగా మహా కుంభమేళ జరగనుంది. ఈ మహా కుంభమేళ.. జనవరి 14 వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఇవి 45 రోజుల పాటు జరగనుంది. ఈ మహా కుంభమేళలో పాల్గొనేందుకు ప్రయాగరాజ్‌కు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలిరానున్నారు. అందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రయాగ్ రాజ్‌కు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.

తాజాగా తెలుగు రాష్ట్రాల నుంచి ప్రయాగరాజ్‌కు వెళ్లే వారిని దృష్టిలో పెట్టుకొని అదనంగా మరో 26 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే గురువారం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, విజయవాడ, కాకినాడ, మచిలీపట్నం.. అలాగే తెలంగాణలో సికింద్రాబాద్, వికారాబాద్, మౌలాలి జంక్షన్ నుంచి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వివరించింది.

మరోవైపు భక్తుల అవసరాలు, భద్రత కోసం ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. ఈ ప్రయాగరాజ్ కుంభమేళలో దాదాపు 45 కోట్లకు పైగా భక్తులు పాల్గొని గంగాసాన్నం ఆచరించే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకోసం యోగి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.


SPl-Trains.jpg

మరిన్ని తెలుగు వార్తలు కోసం..

Also Read : ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ప్రశాంత్ కిషోర్

Also Read: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత సంచలన ఆరోపణలు

Also Read: లాలు ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం నితీష్ కుమార్

Also Read: బీఎస్ఎఫ్‍పై సీఎం మమత ఆరోపణలు.. స్పందించిన బీజేపీ

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jan 02 , 2025 | 07:25 PM