Share News

Special Trains: తెలుగు రాష్ట్ర ప్రజలకు బిగ్ రిలీఫ్.. 8 ప్రత్యేక రైళ్లు..

ABN , Publish Date - Jan 17 , 2025 | 08:06 PM

సంక్రాంతి పండుగకు స్వ‌గ్రామాల‌కు వెళ్లిన వారు తిరుగు ప్ర‌యాణం అవుతున్నారు. దీంతో పలు రైల్వేస్టేష‌న్లు, బ‌స్ కాంప్లెక్స్‌లు ప్ర‌యాణికుల‌తో నిండిపోయాయి. అయితే, తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణీకుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే 8 ప్రత్యేక రైళ్లను నడపనుంది.

Special Trains: తెలుగు రాష్ట్ర ప్రజలకు బిగ్ రిలీఫ్..  8 ప్రత్యేక రైళ్లు..
Special Trains

Special Trains : సంక్రాంతి పండుగ అయిపోయింది. కుటుంబ స‌భ్యులు, బంధువులు, స్నేహితుల‌తో కలిసి ఎంతో సంతోషంగా గడిపిన ప్ర‌జ‌లు.. తిరుగు ప్ర‌యాణాలు మొదలుపెట్టారు. దీంతో పలు రైల్వేస్టేష‌న్లు, బ‌స్ కాంప్లెక్స్‌లు ప్ర‌యాణికుల‌తో రద్దీ అయ్యాయి. అయితే, తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణీకుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే 8 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల మధ్య ఈ రైళ్లు నడవనున్నాయి. అయితే, ఇప్పటికే సంక్రాంతి రద్దీ దృష్ట్యా పలు ప్రాంతాల మధ్య దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోన్న సంగతి తెలిసిందే. వీటికి అదనంగా మరో 8 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్ ఎకానమీ, స్లీపర్ కోచ్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని తెలిపారు.

ప్రత్యేక రైళ్లు

జనవరి 18: కాకినాడ టౌన్ – చర్లపల్లి (నెం.07215)

జనవరి 18: విశాఖపట్నం – చర్లపల్లి (రెండు సర్వీసులు),జనవరి 19 తేదీన ఒక సర్వీసు

జనవరి 19: నర్సాపూర్ – చర్లపల్లి (ఒక సర్వీసు)

జనవరి 19, 20: చర్లపల్లి – విశాఖపట్నం

జనవరి 19: చర్లపల్లి – భువనేశ్వర్


కాకినాడ టౌన్ – చర్లపల్లి ప్రత్యేక రైలు ఆగే రైల్వే స్టేషన్లు:

సామర్లకోట

రాజమండ్రి

నిడదవోలు

తణుకు

భీవరం టౌన్

ఆకివీడు

కైకలూరు

గుడివాడ

రాయనపాడు

ఖమ్మం

డోర్నకల్

మహబూబాబాద్

వరంగల్

కాజీపేట్

జనగామ

నర్సాపూర్ – చర్లపల్లి ప్రత్యేక రైలు ఆగే రైల్వే స్టేషన్లు:

పాలకొల్లు,

భీమవరం జంక్షన్

భీమవరం టౌన్

ఆకివీడు

కైకలూరు

గుడివాడ

రాయనపాడు

ఖమ్మం

వరంగల్

కాజీపేట్

జనగామ స్టేషన్

విశాఖ – చర్లపల్లి ప్రత్యేక రైళ్లు ఆగే రైల్వే స్టేషన్లు:

దువ్వాడ

అనకాపల్లి

ఎలమంచిలి

తుని

అన్నవరం

సామర్లకోట

రాజమండ్రి

నిడదవోలు

తాడేపల్లిగూడెం

ఏలూరు

విజయవాడ

గుంటూరు

సత్తెనపల్లి

పిడుగురాళ్ల

నడికుడి

మిర్యాలగూడ

నల్గొండ స్టేషన్

చర్లపల్లి – భువనేశ్వర్ ప్రత్యేక రైలు ఆగే రైల్వే స్టేషన్లు:

నల్గొండ

మిర్యాలగూడ

గుంటూరు

విజయవాడ

తాడేపల్లిగూడెం

నిడదవోలు

రాజమండ్రి

సామర్లకోట్

దువ్వాడ

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం రోడ్

పలాస

బ్రహ్మపూర్

బలుగాన్

ఖర్దా రోడ్ స్టేషన్

Updated Date - Jan 17 , 2025 | 08:06 PM