Andhra Pradesh: మహాశివరాత్రి సందర్భంగా ఏపీ టూరిజం గుడ్ న్యూస్
ABN , Publish Date - Feb 18 , 2025 | 03:28 PM
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం సిద్ధమైంది. రేపటి నుంచి శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో భక్తులకు ఏపీ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది.
విజయవాడ: మహాశివరాత్రి సందర్బంగా ఆ పరమేశ్వరుణ్ని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో శైవక్షేత్రాలకు భక్తులు క్యూ కడతారు. ముఖ్యంగా శ్రీశైలం మల్లన్న దర్శనానికి జనం తండోపతండాలుగా తరలివస్తారు. శివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు అక్కడ ఘనంగా జరుగుతాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఈ నేపథ్యంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఏపీ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది.
విజయవాడ నుండి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. రాజమండ్రి నుండి ప్రత్యేక టూరిజం బస్సులు బయలుదేరనున్నాయి. మూడు రోజులపాటు ఏపీ టూరిజం ఆధ్వర్యంలో శ్రీశైలం యాత్ర కొనసాగతుంది. టూరిస్టులను తీసుకువెళ్లే ప్రదేశాలు ఏంటంటే.. శక్తిపీఠం శ్రీశైలం భ్రమరాంబ టెంపుల్, శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం, త్రిపురాంతకేశ్వరి స్వామి టెంపుల్, బాలా త్రిపుర సుందరి దేవి టెంపుల్. మహాశివరాత్రి సందర్భంగా అక్కడికి వెళ్లాలనుకునే భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
Also Read: వైరల్ ఆడియోపై కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు